భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి. ఒక్కో మతానికి ఒక్కో రకమైన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఉంటాయి. ఇక హిందూమతంలో కూడా రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ఆచారాలు వినడానికి సిల్లీగా ఉంటాయి కానీ దాని వెనక ఉన్న అర్థం తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అపరిచితుడు సినిమాలో కొన్నిఆచారాల గురించి వాటి వల్ల వచ్చే లాభాల గురించి క్లైమాక్స్ లో హీరో చెబుతాడు. ఇంటి ముందు ముగ్గు వేయడానికి కారణం అది పిచ్చుకలకు ఆహారమని.
Advertisement
అదేవిధంగా గుమ్మానికి పసుపు రాయడానికి కారణం అది బయట నుండి వ్యాధులు రాకుండా యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుందని. అదేవిధంగా గుమ్మానికి మామిడాకులు కట్టడానికి కారణం మామిడాకులు ఎండాకాలంలోనూ ఆక్సిజన్ ను ఇచ్చే గుణాన్ని కలిగి ఉండటం. ఇలా చాలా ఆచారాల వెనక అంతరార్ధాలు ఉంటాయి. ఇదిలా ఉంటే దేశంలో ఎన్నో వేల దేవాలయాలు ఉన్న సంగతి తెలిసిందే.
Advertisement
అయితే ప్రతి ఆలయంలో తప్పకుండా గంట మాత్రం కనిపిస్తుంది. దేవుడిని దర్శించుకునే ముందు ప్రతి ఒక్కరూ గంట కొట్టడం జరుగుతుంది. అయితే గంట కొట్టే సమయంలో కచ్చితంగా మూడుసార్లు కొట్టాలని చెబుతారు. కానీ అలా ఎందుకు చెబుతారు అన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. అయితే గంట కొట్టడం గురించి పురాణాల్లో ఓ శ్లోకం దాగి ఉంది. ఆ శ్లోకం ఏంటంటే…. ఏకతాడే మరణం చేయవా.
ద్వితాడే వ్యాధి పీడనం సుఖమా ప్నోతి. తతంటా నాదలక్షణం. ఈ శ్లోకం భావం చూసినట్లయితే దేవుని ముందు గంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకున్నట్టు అయితే అది మరణానికి సంకేతమట. రెండుసార్లు గంట కొట్టి ఊరుకుంటే అది వ్యాధుల ద్వారా పీడించబడతామని అర్థమట. ఇక మూడుసార్లు ముచ్చటగా గంట కొట్టడం చేస్తే శరీరానికి మనసుకు సుఖం కలుగుతుందని అర్థం వస్తుందట. కాబట్టి ఆలయాల్లో గంట మూడు సార్లు కొట్టాలని చెబుతుంటారు.