తమిళ నాడు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బడుగు బలహీన వర్గాల వారిని గుళ్లల్లో పూజారులుగా నియమించాలన్న దశాబ్దాల నాటి డిమాండ్ ను నెరవేర్చింది సర్కార్. బీసీలు, ఎస్సీలను అర్చకులుగా నియమిస్తూ.. తమిళనాడు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్క రోజజు ముందు బ్రాహ్మణులు కానీ 58 మందిని పూజారులుగా.. నియామకం చేసింది. అందులో ఒక మహిళ కూడా ఉన్నారు.
Advertisement
Advertisement
ఆమె పేరు సుహంజన గోపీనాథ్. ఆ నియామకంతో తమిళ నాడులో రెండో మహిళా పూజారిగా ఆమె రికార్డుల కెక్కారు. ప్రస్తుతం ఆమెను చైన్నెలోని ధేనూపురీశ్వర్ ఆలయంలో పూజారిగా నియామించారు. ఒడియార్ వర్గం కింద ఆమెకు శిక్షణ ఇచ్చారు. అంతకుముందు పిన్ని యక్క్ అనే మహిళ తన తండ్రి చనిపోవడంతో వారసత్వంగా అర్చకత్వం చేశారు. దీంతో తమిళనాడులో తొలి మహిళా పూజారిగా నిలిచారు. అయితే.. పూజారిగా ఆమెను ఎవరూ అంగీకరించకపోవడంతో కోర్టు వెళ్లివిజయం సాధించారు.