ఏ వ్యక్తికి అయినా గౌరవాన్ని తెచ్చిపెట్టేవి వారి ప్రవర్తన..లక్షణాలే. ఒక్కొక్కరిలో ఒక్కోరకమైన ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమందికి మన ప్రవర్తన మన లక్షణాలు నచ్చకపోతే అది మన తప్పు కాదు కానీ ఎక్కువమంది మన వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే కచ్చితంగా ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది. పురుషులు స్త్రీలను ఇష్టపడాలి అన్నా.. స్త్రీలు పురుషులను ఇష్టపడాలి అన్నా వారిలో ఉండే లక్షణాలు ప్రవర్తన పైనే ఆధారపడి ఉంటుంది.
Advertisement
కాగా ఆచార్య చాణక్యుడు స్త్రీలలో కొన్ని లక్షణాలు ఉంటే పురుషుడు ఎక్కువగా ఇష్టపడతారని తన చాణక్యనీతిలో పేర్కొన్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం… డబ్బులు మితంగా ఆచితూచి ఖర్చు చేసే వాళ్ళు అంటే పురుషులు ఇష్టపడతారట. డబ్బును చూసి ఖర్చు చేసే వారికి కష్టం విలువ కూడా తెలుస్తుందని పురుషులు అభిప్రాయపడతారని చాణక్యనితిలో పేర్కొన్నాడు.
Advertisement
జీవితం సాఫీగా సాగిపోవాలంటే ముందుగా ఇంటిని నడపడంలో జాగ్రత్తగా ఉండాలట. ఇంటిని జాగ్రత్తగా నడిపే మహిళలు అంటే పురుషులు ఇష్టపడతారట. పిల్లల బాగోగులు చూసుకోవడం భర్త క్షేమాన్ని కోరుకోవడం అదేవిధంగా ఇంటికి సంబంధించిన ప్రతి విషయాన్ని పట్టించుకునే మహిళలు అంటే పురుషులు ఇష్టపడతారట.
అంతేకాకుండా జాలి, దయ కలిగిన మహిళలను పురుషులు ఇష్టపడతారట. అలాంటివాళ్లు ఎదుటివారికి కష్టం వచ్చినప్పుడు సాయం చేయడంతో పాటు సొంత వారిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారని చాణక్యుడు చాణక్యనీతిలో పేర్కొన్నాడు.