హర్భజన్ సింగ్ ఇండియన్ స్పిన్ బౌలర్. తన బౌలింగ్ మాయాజాలంతో ఎన్నో విజయాలు అందించారు. బౌలింగ్‌తో పాటు బజ్జీ అప్పుడప్పుడు బ్యాట్‌తో కూడా విజయాలు అందించేవాడు. హర్భజన్ సింగ్ ఐపీఎల్ సీజన్లో కొన్నేళ్లు చెన్నై జట్టుకు ఆడారు. చెన్నై జట్టుకు అనేక విజయాలు అందించాడు. బజ్జీ స్వతహాగా క్రికెటర్ అయినప్పటికీ సినిమాల పట్ల అమితమైన ప్రేమ ఉండేది.
కొన్ని పంజాబీ సినిమాల్లో నటించాడు కూడా. హర్భజన్ సింగ్‌కు రజనీకాంత్ అంటే వల్లమాలిన అభిమానం. ఆయన సినిమాలు వదిలిపెట్టకుండా చూస్తుంటాడు. రజనీకాంట్ స్టైల్‌కు పెద్ద ఫ్యాన్ అన్నమాట. అలాంటి బజ్జీ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. బజ్జీ తన హృదయంపై రజీనీ టాటూను వేయించుకున్నాడు. టాటూ వేయించుకోవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. నోప్పిని భరించాలి. చిన్నఅక్షరం వేయించుకుంటేనే భరించలేనంత నొప్పి కలుగుతుంది. ఇక బొమ్మను టాటాగా వేయించుకోవాలంటే ఇంకెంత నొప్పి కలుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. గుండెల్లో ఉన్న రజనీనీ తన గుండెలపై శాశ్వతంగా ఉండేలా టాటూ వేయించుకోవడం ఆనందంగా ఉందని బజ్జీ చెప్పాడు.
Advertisement