విశాఖను పరిపాలనా రాజధానిగా పెట్టాలని డిమాండ్ చేస్తూ టెక్కలి ఎంఎల్సి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా విశాఖ గర్జనకు వస్తున్నారు. టెక్కలి నుండి వైసీపీ నేతలు, కార్యకర్తలు బయలు దేరారు.
జల దిగ్బంధంలో ఏడు పాయల ఆలయం కనిపిస్తోంది. అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా నది ప్రవహిస్తోంది. నీళ్ళు రావడం తో ఆలయాన్ని మూసేసి రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు.
Advertisement
180వ రోజుకు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేరుకుంది. నేడు నిజామాబాద్ లోని బీర్కూర్ నైట్ పాయింట్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.
ఈ నెల 18 నుండి మునుగోడు లో ప్రచారానికి బండి సంజయ్ బయలుదేరారు. ఈ నెల 18 నుంచి 23 వరకు మునుగోడు లో బండి సంజయ్ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 18 న మర్రి గూడ మండలం నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. ఈ నెల 23 వరకు మునుగోడు నియోజకవర్గంలో రోడ్ షో లు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో గత రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్, కూకట్ పల్లి, మెహదీపట్నం, మంగళ్ హాట్, మాసబ్ ట్యాంక్, లింగంపల్లి, మదీనాగూడ, కొండాపూర్, మల్లేపల్లిలో వర్షం కురిసింది.
Advertisement
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. 119 మంది అభ్యర్థులు 187 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరుతున్నారు. బూర నర్సయ్య గౌడ్ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు. మునుగోడు టీఆర్ఎస్ సీటును బూర ఆశించారు.
ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక ముందే తెలియాలని పేర్కొన్నారు. దాంతో జట్టు సభ్యులు ముందే సన్నద్ధం అవుతారని పేర్కొన్నారు.
దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. తాజాగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ 107వ స్థానానికి పడిపోయింది. 121 దేశాల్లో భారత్ దాదాపు అట్టడుగు స్థానంలో నిలిచింది.