మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లూసిఫర్ సినిమా అక్టోబర్ 9న దసరా కానుకగా విడుదలైంది. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కించారు. లూసిఫర్ కు రీమేక్ గా గాడ్ ఫాదర్ ను తెరకెక్కించినప్పటికీ సినిమాలో చాలా మార్పులు చేశారు. ఒరిజినల్ కంటే గాడ్ ఫాదర్ సినిమా కథలో చాలా మార్పులు చేశారు.
Advertisement
ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. లూసిఫర్ సినిమా చూసిన సుకుమార్ ఈ సినిమా చిరంజీవికి చాలా బాగా సెట్ అవుతుందని చరణ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చరణ్ తన తండ్రికి చెప్పగా చిరు కూడా సినిమా చూసి ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత మోహన్ రాజాను పిలిపించి ఈ ప్రాజెక్టులో తన నటించారు.
Advertisement
ఇక అలా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో సత్యదేవ్ నటించిన సంగతి తెలిసిందే. అయితే సత్యదేవ్ పాత్ర వెనుక చాలా కథ నడిచింది అన్న విషయం ఎవరికీ తెలియదు. గాడ్ ఫాదర్ లో విలన్ పాత్ర కోసం మొదట అరవింద్ స్వామి సంప్రదించినట్టు తెలుస్తోంది.
కానీ ఆయన డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ ఆఫర్ కు నో చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ను సైతం ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ గోపీచంద్ ఈ పాత్ర అంత బలంగా లేదని రిజక్ట్ చేశారట. దాంతో చివరికి ఈ పాత్ర కోసం ఇటీవల కాలంలో నటనతో మెప్పిస్తున్న సత్యదేవ్ ను సంప్రదించారు. ఇక సినిమాలో సత్యదేవ్ తన నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.