టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరం తర్వాత వచ్చిన హీరోలలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇక ప్రస్తుతం వీళ్ళలో ఇద్దరు హీరోల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఎదగ్గా… బాలయ్య కుమారుడు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు వెంకటేష్ కొడుకు కూడా కచ్చితంగా రెండు మూడేళ్లలో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
ఇక కొడుకుల ఎంట్రీతో ఈ హీరోలు సీనియర్ హీరోలుగా మారిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలు అయినప్పటికీ కూడా కుర్ర హీరోలకు సైతం పోటీగా సినిమాలు చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. రొటీన్ కథలను ఎంచుకోకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వెంకటేష్ నారప్ప, ఎఫ్ 3 లాంటి సినిమాలతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ లను అందుకున్నాడు. అదేవిధంగా చిరంజీవి గాడ్ ఫాదర్, ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమాలతో సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్య విషయానికి వస్తే అఖండ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా నాగార్జున బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ హీరోలు నటించిన కొన్ని సినిమాలు అమెరికాలో మిలియన్ డాలర్స్ ను వసూలు చేసి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
Advertisement
ఆ సినిమాలే ఏవో ఇప్పుడు చూద్దాం…. చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాలు అమెరికాలో మిలియన్ డాలర్స్ ను వసూలు చేశాయి.
అదేవిధంగా వెంకటేష్ హీరోగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్2, ఎఫ్3 సినిమాలు సైతం ఆ లిస్టులో చేరాయి.
అంతేకాకుండా బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, అఖండ సినిమాలు సైతం యూఎస్ లో మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరాయి. అ
దే విధంగా నాగార్జున హీరోగా నటించిన మనం, ఊపిరి సినిమాలు సైతం అమెరికాలో మిలియన్ డాలర్లు వసూలు చేసిన లిస్టులో చేరాయి.