సెలబ్రెటీలు బయట అడుగుపెట్టాలంటే వారి వెంట బాడీ గార్డులు ఉండాల్సిందే. షాపింగ్ కు వెళ్లినా…తమకు సంబంధించిన ఏ చిన్న ప్రోగ్రాం కు వెళ్లాలన్న బాడీ గార్డులు కావాలి. లేదంటే అభిమానులు ప్రేక్షకుల మధ్యలో పడి నలిగిపోయే అవకాశం కూడా ఉంది. సెల్ఫీల కోసం ఎగబడితే ఆ జనాల్లో ఊపిరికూడా ఆడదు. దాంతో ఒక్కో సెలబ్రెటీ వెంట నలుగురు బాడీగార్డులు తప్పకుండా ఉంటారు. అయితే వారిని ఎంతో కష్టపడి రక్షించే బాడీగార్డులకు జీతాలు కూడా అదే రేంజ్ లో ఇస్తుంటారు సెలబ్రెటీలు.
అప్పట్లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బాడీగార్డు జీతం గురించి సోషల్ మీడియాలో తెగ చర్ఛ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీమ్ ఇండియా రథసారధి విరాట్ కోహ్లీ ఆయన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ ల బాడీగార్డు జీతం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విరుష్క జంటకు ప్రకాష్ ఉరఫ్ సింగ్ అనే బాడీగార్డు కొన్నేళ్లుగా రక్షకుడిగా ఉన్నారు. వాళ్లు ఎక్కడకు వెళ్లినా ప్రకాష్ ఉరఫ్ సింగ్ ఉండాల్సిందే.
Advertisement
Advertisement
also read : పెళ్లి కాకుండానే తండ్రులైన క్రికెటర్లు వీళ్లే..
ఇక ఉరఫ్ సింగ్ కు విరుష్క జంట ఏడాదికి కోటి ఇరవై లక్షల సాలరీ ఇస్తుందట. నిజానికి ఈ జీతం కార్పొరేట్ కంపెనీల సీఈవోల కంటే కూడా ఎక్కువే మరి. అంత సాలరీ ఇవ్వడానికి కూడా ఓ కారణం ఉందట. ఉరఫ్ సింగ్ కోహ్లీకి పెళ్లి కాకముందు నుండే అతడికి అంగరక్షకుడిగా ఉన్నారట. మిగతా బాడీగార్డులు కూడా ఉన్నప్పటికీ విరాట్ అనుష్కల వెంట ఉరఫ్ సింగ్ కచ్చితంగా ఉండాల్సిందేనట. అంతే కాకుండా విరద్దరూ కూడా ఉరఫ్ సింగ్ ను కుంటుంబ సభ్యుడిగా చూసుకుంటారట.