సరోగసి అంటే ఒకప్పుడు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు సరోగసి అనే పదం కామన్ గా వినిపిస్తుంది. ఐవైనా అనారోగ్య సమస్యల కారణంగా పిల్లలను కనలేనివారు ఈ పద్దతి ద్వారా బిడ్డలకు జన్మనిస్తారు. ఈ పద్దతిలో బిడ్డను కనలేని మహిళ అండాన్ని ఇతర మహిళ గర్భసంచిలో ప్రవేశపెట్టి బిడ్డను పుట్టించడం. అయితే కొంతమంది తమ అందం తరగవద్దని భావించేవారు కూడా ఈ పద్దతి ద్వారా బిడ్డలకు జన్మస్తున్నారు. కానీ అది నేరం అన్న సంగతి చాలా మందికి తెలియదు.
Advertisement
రీసెంట్ గా నయనతార విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసి పద్దతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే పెళ్లైన నాలుగు నెలలకే వీరు బిడ్డలకు జన్మనివ్వడంతో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిడ్డను కనలేని పక్షంలోనే సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వాలని కానీ పెళ్లి కాకముందే నయన్ విఘ్నేష్ లు బిడ్డలను కనేందుకు ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ ఘటన పై విచారణకు ఆదేశించింది.
Advertisement
ఇదిలా ఉండగా నయనతార బిడ్డలకు జన్మినవ్వకపోవడానికి ఇదే కారణం అంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే నయనతార బిడ్డకు జన్మనివ్వకపోవడానికి కారణం ఆమెకు ఉన్న భయమే అంటూ కొన్ని కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది నయన్ కు సపోర్ట్ గా నిలుస్తుంటే మరికొంత మంది మాత్రం నయన్ చేసిన పనికి మండిపడుతున్నారు.
నిజానికి బిడ్డకు జన్మనివ్వడం అంత సులువైన విషయం కాదు. స్త్రీకి అది మరో జన్మ లాంటింది. ఒకరకంగా చెప్పాలంటే ఆ బాధ నరకంలాంటిది అని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఆపరేషన్ ద్వారా సులువుగా కనేయవచ్చని చెబుతారు కానీ చిన్న సూది గుచ్చితేనే తట్టుకోలేం అలాంటిది ఆపరేషన్ అంటే అది కూడా మాటల్లో చెప్పుకునేంత చిన్నవిషయం కాదు ఏమైనా జరగవచ్చు. కాబట్టి నయన్ ను సపోర్ట్ చేస్తున్నవాళ్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు.