ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సెలబ్రెటీ అవుతున్నారు. ఇక రీసెంట్ గా కండక్టర్ జాన్సీ ఒక్క డ్యాన్స్ తో స్టార్ గా మారిపోయారు. కండక్టర్ జాన్సీ ఏపీ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నారు. అంతే కాకుండా చిన్నప్పటి నుండి డ్యాన్స్ పై ఉన్న ఆసక్తితో జాన్సీ స్టేజ్ డ్యాన్సర్ గా కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో జాన్సీ స్టెప్పులు వేసే అవకాశం అందుకున్నారు.
Advertisement
ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతివారం టాలెంట్ ఉన్నవాళ్లను కొత్తవాళ్లను తీసుకువచ్చి వారి టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కండక్టర్ జాన్సీని సైతం శ్రీదేవి డ్రామా కంపెనీకి తీసుకువచ్చి ఆమెతో స్టెప్పులు వేశారు. పల్సర్ బైక్ మీద రార బావో అంటూ జాన్సీ వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Advertisement
ఆ పాట యూట్యూబ్ ను షేక్ చేయడంతో జాన్సీ వరుస ఆఫర్ లు అందుకుంటుంది. ఇప్పటికే పలు టీవీ షోలలో జాన్సీ సందడి చేస్తుండగా ఆమెను పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో జాన్సీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మల్లెమాలలో డ్యాన్స్ మాస్టర్ గా చేస్తున్న శ్రీను మాస్టర్ యూట్యూబ్ లో వైరల్ అయిన తన పాట చూసి ఆఫర్ ఇచ్చారని చెప్పారు.
ఆ తరవాత తనకు ఫోన్ చేసి పిలిపించి డ్యాన్స్ నేర్పించారని తెలిపారు. ప్రతిరోజూ చార్జీలు ఇవ్వడంతో పాటూ ఫుడ్ పెట్టేవారని అన్నారు. శనివారం తప్ప ప్రతిరోజూ అక్కడ నాన్ వెజ్ పెడతారని జాన్సీ వెల్లడించారు. అంతే కాకుండా రెమ్యునరేషన్ గురించి ఇక్కడ మాట్లాడుకోకూడదు అంటూ సమాధానం దాటవేశారు. ఇక రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నప్పటికీ జాన్సీ మాత్రం సెలబ్రెటీ అయ్యింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చదవండి !