సినిమా కథలు నిజజీవితాల నుండే పుడతాయి. ఇక సినిమాల ప్రభావం ప్రేక్షకుల పై ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి రాజకీయాల కోసం కూడా సినిమాలను చాలా సందర్భాలలో వాడుకుంటూ ఉంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూనే ఇప్పుడు తన సినిమాను రాజకీయాల కోసం వాడుకున్నారు అనే ఆరోపణలను ఎదురుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
Advertisement
ఈ సినిమా మలయాళ లూసీఫర్ కు రీమేక్ గా తెరకెక్కింది. అయితే లూసీఫర్ కు ఈ సినిమాకు 50 శాతానికి పైగా మార్పులు చేశారు. లూసీఫర్ సినిమాలో సీఎం చనిపోతాడు. గాడ్ ఫాదర్ లో కూడా సీఎం చనిపోతాడు. అయితే అక్కడ బడా వ్యాపారి తనకు నచ్చిన వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి చక్రం తిప్పాలని అనుకుంటాడు. కానీ గాడ్ ఫాదర్ లో వ్యాపారవేత్తనే స్వయంగా సీఎం అవ్వాలని అనుకుంటాడు.
Advertisement
ఇక సీఎం చనిపోయిన తరవాత పార్దివదేహం వద్దనే రాజకీయాలు జరుగుతుంటాయి. ముఖ్యనేతలు అంతా రాజకీయాల గురించే చర్చిస్తూ ఉంటారు. అయితే అలాంటి ఒక సన్నివేశమే ఏపీ రాజకీయాల్లోనూ గతంలో చోటు చేసుకుంది. ఇక కుర్చీలాటలో ఎలాంటి జిమ్మిక్కులు ఉంటాయో ఈ సినిమాలో చూపించారు. అంతే కాకుండా రాజకీయాల్లో ఉండే డొల్లతనాన్ని బయట పెట్టారు. తన కుటుంబ సభ్యుల ఆస్తులను కాపాడుకోవడానికి రాజకీయాలను ఎలా వాడుకుంటారు అన్న విషయాలను చూపించారు.
మరోవైప సినిమాలో ప్రతిపక్ష నాయకుడి పేరు నిజజీవితంలోని ఓ ప్రతిపక్షనాయకుడి పేరు దగ్గర దగ్గరగా ఉన్నాయి. మరోవైపు పార్టీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి అవతలి పార్టీతో చేతులు కలిపి పార్టీని ఎలా లాక్కునే ప్రయత్నం చేస్తాడో చూపించారు. అలాంటి ఓ సీన్ కూడా ఏపీ పాలిటిక్స్ లో చూసిందే. ఇలా కొన్ని సీన్లు రియల్ పాలిటిక్స్ దగ్గరగా ఉండటంతో పాటూ చిరంజీవి ఈ సినిమా ద్వారా తన పొలిటికల్ స్ట్రాటజీని ప్రదర్శించారని కొంతమంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.