Home » పెళ్లి పీట‌లు ఎక్కనున్న సుషాంత్ మాజీ ప్రేయ‌సి…ప్రీవెడ్డింగ్ ఫోటోలు వైర‌ల్..!

పెళ్లి పీట‌లు ఎక్కనున్న సుషాంత్ మాజీ ప్రేయ‌సి…ప్రీవెడ్డింగ్ ఫోటోలు వైర‌ల్..!

by AJAY
Ad

ప్రస్తుతం బాలీవుడ్ లో జోరుగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. రీసెంట్ గా రాజ్ కుమార్ రావు పత్రలేక‌ వివాహం జరగ్గా మొన్నే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వివాహం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్దం అయ్యింది. అంకిత విక్కీతో ప్రేమలో ఉంది. గత మూడేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇక ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోవడంతో డిసెంబర్ 14న ముంబైలోని గ్రాండ్ హోటల్ లో వివాహానికి ఏర్పాట్లుపూర్తి చేశారు. అంతేకాకుండా ఈ రోజు ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ankitha lokhande

ankitha lokhande

అంతేకాకుండా పెళ్లి జరిగిన తర్వాత బాలీవుడ్ తారల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని ఘనంగా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండ‌గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి అంకిత‌ పవిత్రారిష్తే అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. ఈ సీరియ‌ల్ హిందీలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సీరియల్ చిత్రీకరణ సమయంలోనే అంకిత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లు ప్రేమించుకున్నారు. ఆరేళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమాలతో బిజీ అవడం…. ఇతర కారణాల వల్ల వీరిద్దరి ప్రేమకు బ్రేక్ అప్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోయిన్ రియా చక్రవర్తితో ప్రేమలో పడ్డాడు. గతేడాది సుషాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక అంకిత విక్కీతో ప్రేమలో పడింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన సమయంలో అంకిత లోఖండే ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా రియా చక్రవర్తి పై కూడా అంకిత సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ తనకున్న అనుబంధంతో గుర్తు చేసుకుని సోషల్ మీడియాలో చాలా సార్లు ఎమోషనల్ అయ్యింది.

Visitors Are Also Reading