ప్రేమకు రంగు రూపం, కులం మతం, వయసు లింగం ఇలా ఏ బేదాలు ఉండవని చెబుతుంటారు. తాజాగా ఇదిమరోసారి రుజువు అయ్యింది. యాబైఏళ్ల వ్యక్తితో పద్దెనిమిదేళ్ల యువతి ప్రేమలో పడింది. అంతే కాకుండా వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వీరిద్దరి ప్రేమ పెళ్లి వార్తలు కొద్దిరోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నా అసలు ఇద్దరి మధ్య ఎలా పరిచయం ఏర్పడింది. అంత ఏజ్ గ్యాప్ ఉన్న వ్యక్తితో పద్దెనిమిదేళ్ల యువతి ఎలా ప్రేమలో పడింది. అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
Advertisement
కాగా తాజాగా వీరిద్దరి ప్రేమకు పెళ్లికి కారణం ఏంటి..? ఇద్దరి మధ్య ఎలా పరిచయం ఏర్పడింది అన్న విషయాలను సదరు యాభైఏళ్ల ప్రేమికుడు బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే…పాకిస్థాన్ కు చెందిన ముస్కాన్ పాటలు సూపర్ గా పాడుతుంది. ఆ యువతి ఇంటి ఎదురుగా యాభైఏళ్ల ఫరూక్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ముస్కాన్ పాటలు అంటే ఫరూక్ చెవి కోసుకుంటాడు.
Advertisement
తరచూ ఆమె స్వరం వినేందుకు ఫరూక్ ముస్కాన్ ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ పాటల గురించి చర్చించుకునేవారు. ఇక ముస్కాన్ తరచూ తన పాటలు వింటూ మెచ్చుకుంటున్న ఫరూక్ తో ప్రేమలో పడింది. ఒకరోజు ముస్కాన్ బాబీడియోల్ పాట అయిన నా మిలో హంసే జుదా అనే పాటను పాడి తనలోని ప్రేమను ఫరూక్ కు వ్యక్త పరిచింది.
అలా ఇద్దర మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు. ఇక ముస్కాన్ మాట్లాడుతూ మా ఇద్దరి బంధం గురించి ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకోము అని అని తెలిపింది. మొదట తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ఆ తరవాత ఒప్పుకున్నారని పేర్కొంది.