ప్రముఖ మలయాళ దర్శకుడు అలీ అక్బర్ CDS జనరల్ బిపిన్ రావత్ విషాద మరణాన్ని సెలెబ్రేట్ చేసుకున్న వారికి నిరసనగా ఇస్లాంను విడిచి పెడుతున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో అక్బర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయంపై తన భార్యతో చర్చించిన తర్వాత తాను ఇస్లాంను విడిచి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు అక్బర్ తెలిపారు. “నేను పుట్టిన దుస్తులను విసిరి వేస్తున్నాను” అని అతను చెప్పాడు. 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన అక్బర్ వయసు ఇప్పుడు 58 ఏళ్ళు. 1988 సంవత్సరంలో ఉత్తమ తొలి దర్శకుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకోవడంతో ఆయన కీర్తిని పొందారు. మలయాళంలో ఇప్పుడు ఆయన మలబార్ తిరుగుబాటు, మారణకాండ ఆధారంగా ‘1921; పూజ ముతల్ పుజా వరే’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.
Advertisement
హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య దుర్మరణం చెందడంపై హర్షం వ్యక్తం చేస్తున్న వారిని విమర్శిస్తూ అక్బర్ ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. “ఈ రోజు నుండి నేను ముస్లింని కాదు. నేను భారతీయుడిని” అని చిత్రనిర్మాత అందులో పేర్కొన్నాడు. క్లిప్‌లో జనరల్ రావత్ మరణానికి సంబంధించిన వార్తా నివేదికల క్రింద స్మైలీ ఎమోజిలను ఉంచేవారిని అతను దూషించాడు. “దేశ వ్యతిరేకుల”తో తాను ఇకపై నిలబడలేనని చెప్పాడు. కేరళ మిన్ మహ్మద్ రియాస్ వివాహాన్ని ప్రశ్నించినందుకు ముస్లిం లీగ్ నాయకుడిపై కేసు నమోదైంది. తనను రామ్ సింగ్ అని పిలుస్తారని అక్బర్ అన్నారు.
Advertisement
మలపరంబ (ప్రస్తుతం మలప్పురం జిల్లా)లోని ప్రముఖ కుటుంబానికి చెందిన రామసింహన్, అతని సోదరుడు దయాసింహన్ లేదా నరసింహన్, దయాసింహన్ భార్య కమల, ఇస్లాం నుండి హిందూమతంలోకి మారిన తర్వాత 2 ఆగస్టు 1947న హత్య చేయబడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న అలీ అక్బర్ కొన్ని విభేదాల కారణంగా అక్టోబర్‌లో పదవికి రాజీనామా చేశారు.