మెగాస్టార్ చిరంజీవికి రీఎంట్రీ తరవాత ఇప్పటి వరకూ సరైన హిట్ పడలేదనే చెప్పాలి. రీఎంట్రీ తరవాత వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా వచ్చి విజయం సాధించింది. కానీ ఈ సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు చేయగా ఆ రేంజ్ లో వసూళ్లను రాబట్టలేదు. ఇక రీసెంట్ గా చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు.
Advertisement
భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పాటూ చిరంజీవి పై మరియు సినిమా పై ట్రోల్స్ వస్తున్నాయి. దాంతో చిరు ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ లో నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని దసరాకు విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు ముందే సెన్సార్ సభ్యులు చూస్తారన్న సంగతి తెలిసిందే.
Advertisement
ఈ నేపథ్యంలోనే దుబాయ్ లోని సెన్సార్ సభ్యులు సినిమా చూశారు. అంతే కాకుండా దుబాయ్ లో పాత్రికేయుల కోసం స్పెషల్ షోను వేసినట్టు టాక్. దాంతో వాళ్ల సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…ఒరిజినల్ లూసీఫర్ లో మోహన్ లాల్ కేవలం 50 నిమిషాలు కనిపిస్తారట. కానీ గాఢ్ ఫాదర్ లో చిరు 2గంటల పాటూ కనిపిస్తాడని టాక్.
అంతేకాకుండా ఒరిజినల్ లో స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగితే గాఢ్ ఫాదర్ స్కీన్ ప్లే చాలా స్పీడ్ గా ఉంటుందట. లూసీఫర్ లో లేని పది క్యారెక్టర్ లు సినిమాలో ఉన్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా ఈ సినిమా పవన్ కు గబ్బర్ సింగ్ ఎలాంటి కం బ్యాక్ ఇచ్చిందో చిరుకు అలాంటి కమ్ బ్యాక్ ఇస్తుందని దుబాయ్ నుండి రిపోర్ట్ అందింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చుతుందో చూడాలి.