ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత మరియు నాగ చైతన్య కొన్ని సంవత్సరాల తమ ప్రేమ అనంతరం.. 2017 లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. దాదాపు నాలుగేళ్ల పాటు తమ వివాహబందాన్ని గడిపిని ఈ బ్యూటీఫుల్ జంట… ఈ ఏడాది అక్టోబర్ 2 వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు అక్కినేని ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. అటు సమంతపై కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి.
Advertisement
Advertisement
ఈ తరుణంలో మరోసారి తమ విడాకులపై సమంత స్పందించింది. మేమిద్దరం విడిపోవడం పై చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఆ మొత్తం వ్యవహారంపైనా అభిప్రాయాలన్ని ఇప్పటికే చెప్పేశాను. కాబట్టి.. ఇప్పుడు మళ్లీ.. మళ్లీ ఆ విషయం పై స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను అంటూ మరోసారి సమంత.. నాగ చైతన్యకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.