Home » ప‌స‌రు మందుతో ప‌క్ష‌వాతం ప‌రార్….ఒక్క‌రూపాయి కూడా తీసుకోకుండా చికిత్స‌..!

ప‌స‌రు మందుతో ప‌క్ష‌వాతం ప‌రార్….ఒక్క‌రూపాయి కూడా తీసుకోకుండా చికిత్స‌..!

by AJAY
Ad

ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డేవారి క‌ష్టాలు మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. మారిన జీవన విధానం తీసుకుంటున్న ఆహారం..ప‌ని ఒత్తిడి కార‌ణంగా చాలామంది ప‌క్ష‌వాతం బారిన ప‌డుతున్నారు. య‌వ్వ‌న వ‌య‌సులోనే ప‌క్ష‌వాతం భారినపడుతూ న‌రకం అనుభవిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ప‌క్ష‌వాతం కు హ‌లోప‌తి వైద్యం అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ పూర్తిగా న‌యం చేస్తామ‌ని డాక్ట‌ర్లు గ్యారెంటీ ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉంది. అయితే క‌ర్నూలు జిల్లాలో మాత్రం ప‌స‌రుమందుతో మూడు నెల‌ల్లోనే పెరాల‌సిస్ ప‌రార్ అవుతోంది. క‌ర్నూలు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యులు గుర్రం హరిబాబు చౌద‌రి త‌న ప‌స‌రుమందుతో ఈ వైద్యం చేస్తున్నారు. నంద్యాల నుండి కోవ‌ల‌కంట్ల‌కు వెళ్లే మార్గంలో ఉన్న ఉమాప‌తి న‌గ‌ర్ కు తెలుగు రాష్ట్రాల‌తో పాటూ క‌ర్నాట‌క ఇత‌ర రాష్ట్రాల నుండి పేషంట్లు క్యూ క‌డుతున్నారు.

Advertisement

Advertisement

దాదాపుగా 50 ఏళ్ల క్రితం హ‌రిబాబు తండ్రి పిచ్చ‌య్య చౌద‌రి ప‌క్ష‌వాత నివార‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉద‌యం 5గంట‌ల నుండి రాత్రి 10గంటల వ‌ర‌కూ ఇక్క‌డ చికిత్స అందిస్తున్నారు. కేవ‌లం ప‌స‌లు మందుతోనే ఇక్క‌డ ప‌క్ష‌వాతాన్ని త‌గ్గిస్తున్నారు. మూడు రోజుల పాటూ పేషంట్ల‌కు ఇక్క‌డే వైద్యం అందిస్తారు. అంతే కాకుండా వాళ్లు పోస్తున్న ప‌స‌రు మందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోరు. కానీ వస‌తి కోసం ఏర్పాటు చేసిన గ‌దుల‌కు మాత్రం రూ.300 అద్దె తీసుకుంటారు. చికిత్స విష‌యానికి వ‌స్తే మొద‌టి రోజు వెల్లుల్లిని ర‌సం తీసి అందులో బెల్ల కలిపి ఇస్తారు.

also read : SHABARIMALA AYYAPPA : ఇరుముడిక‌ట్టు అంటే ఏమిటి…దానిని ఎలా సిద్దం చేయాలి..?

రెండో రోజు తాము త‌యారు చేసిన రసాన్ని రోగి చెవిలో పోస్తారు. వ్యాధి తీవ్ర‌త‌ను బ‌ట్టి మందును ఇస్తారు. అంతే కాకుండా చివ‌రి రోజు రోగి కంట్లో మందును వేస్తారు. ప‌స‌రు మందు తీసుకున్న‌వారు మూడు నెల‌ల పాటు ప‌త్యం ఉండాల్సి వ‌స్తుంది. ఆ రోజుల్లో వెల్లుల్లి కారం ఆవు నెయ్యితో మాత్ర‌మే అన్నం తినాల్సి ఉంటుంది. బిపీ ఉన్నవాళ్లు మూడు నెల‌లు…షుగ‌ర్ కూడా ఉంటే ఆరు నెల‌ల పాటూ చికిత్స తీసుకోవాలి. తాము చెప్పిన‌వ‌న్నీ పాటించిన వాళ్ల‌కు ప‌క్ష‌వాతం పూర్తిగా త‌గ్గి పూర్వ‌పు స్థితికి చేరుకుంటార‌ని వైద్యులు హ‌రిబాబు చెబుతున్నారు. ఇక్క‌డికి వ‌చ్చిన పేషంట్ లు కూడా తామ‌కు ప‌క్ష‌వాతం త‌గ్గింద‌ని చెబుతున్నారు.

Visitors Are Also Reading