ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఉన్నారు. జక్కన్న శాంతినివాసం అనే సీరియల్ కు మొదట దర్శకత్వం వహించారు. ఈటీవీలో ప్రసారం అయిన ఈ సీరియస్ మంచి రేటింగ్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో రాఘవేంద్రరావు లాంటి స్టార్ డైరెక్టర్ వద్ద ఓనమాలు దిద్దారు. ఇక రాజమౌళి ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించారు. ఆ తరవాత కెరీర్ లోనే వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Advertisement
కేవలం ఒకే రకమైన సినిమాలు కాకుండా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. రాజమౌళి ఇప్పటి వరకూ కేవలం పన్నెండు సినిమాలనే చేశాడు కానీ వందల సినిమాలు చేసినంత క్రేజ్ ను ప్రేక్షకులలో సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమా జక్కన్న ను పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్ లోనూ సత్తా చాటాడు. దేశప్రాధాని నరేంద్రమోడీ సైతం ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.
Advertisement
అంతే కాకుండా రీసెంట్ గా జక్కన్న ఆర్ఆర్ఆర్ లాంటి మరో పాన్ ఇండియా సినిమాతో ముందుకు వచ్చాడు.ఈ మల్టీ స్టారర్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విదేశాల్లోనూ ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఒక్క ఫ్లాప్ లేని పాన్ ఇండియా డైరెక్టర్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. అయితే ఓ ఇంటర్యూలో జక్కన్న తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పారు.
చిన్న వయసులో తన తల్లి తనను గైడ్ చేసిన విధానమే తన సృజనాత్మకతను పెంచిందని చెప్పారు. చిన్న వయసులో తన తల్లి ఎప్పుడూ స్కూల్ కు వెళ్లు హోం వర్క్ చేయాలి అని చెప్పాలేదట. బయటకు వెళ్లి ఆడుకో లేదంటే కామిక్ పుస్తాకాలు చదువుకో అని చెప్పేవారట. ఎక్కువగా కథల పుస్తకాలు చదవమని చెప్పడంతో జక్కన్న పుస్తకాల పురుగు అయ్యారట. జక్కన్న చేతిలో ఒక పుస్తకం ఉంటే దాన్ని పూర్తిగా చదవేవాడట. అలా జక్కన్నకు తన నేర్పిన పాఠాలు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి దోహదపడ్డాయి.