Home » మౌన వ్రతం ఎందుకు చేస్తారు? లాభం ఎంటి?

మౌన వ్రతం ఎందుకు చేస్తారు? లాభం ఎంటి?

by Bunty
Ad

సాధార‌ణం గా కొంత మంది ఇళ్ల లో ప్ర‌తి వారం పూజా ల‌తో పాటు కొన్ని సార్లు మౌన వ్ర‌తం కూడా చేస్తారు. దేవుడి కి పూజా చేస్తూ త‌మ మౌన వ్ర‌తాన్ని పూర్తి చేసుకుంటారు. కానీ మౌన వ్ర‌తం చేసే చాలా మందికి కూడా అసలు మౌన వ్ర‌తం ఎందుకు చేస్తారు? మౌన వ్రతం చేస్తే లాభాలు ఎంటివి? అనే వాటి కి స‌మాధానం ఉండదు. త‌న పూర్వికులు చేశార‌ని తాను చేస్తున్నాని చెబుతూ ఉంటారే త‌ప్పా.. స్ప‌ష్ట మైన స‌మాధానం తెలియదు. అయితే ఈ రోజు మ‌నం మౌన వ్ర‌తం గురించి తెలుసు కుందాం. మౌన వ్ర‌తం ఎందుకు చేయాలి.? ఎలా చేయాలి ? మౌన వ్ర‌తం చేయ‌డం వ‌ల్ల క‌లిగే లాభాల గురించి తెలుసుకుందాం.

Advertisement

Advertisement

మౌన వ్రతం అంటే మునులు ఉండే విధం గా ఉండాల‌ని అర్థం. మునులు త‌పస్సు చేసే స‌మ‌యం లో వారి పంచేంద్రియాలు అయిన నాలుక‌, క‌ళ్లు, చెవులు, శ‌రీరం, ముక్కు ను కూడా మౌనం గా ఉంచుతారు. ఈ స‌మ‌యంలో వారు ఎవ‌రి తో మాట్లాడారు. ఎవ‌రి చెప్పిన‌ది విన‌రు. ఎలాంటి వాస‌న‌లు కూడా చూడ‌రు. అయితే గాలీ మాత్రం పీల్చు కుంటారు. అలాగే త‌మ ను ఎవ‌రు త‌క‌నివ్వ‌రు. ఇలా పంచేంద్రియాల‌ను ఆధీనం లో పెట్టుకుని భ‌గ‌వంతున్ని ప్రార్థిస్తు ఉండ‌టాన్ని మౌన వ్ర‌తం అంటారు. ఈ మౌన వ్ర‌తం లో ఉన్న స‌మ‌యంలో ఘ‌న ఆహారాన్ని కూడా తీసుకోవ‌ద్దు. కేవ‌లం ద్ర‌వ ఆహారాన్ని మీత్రమే తీసుకోవాలి.

అయితే మౌన వ్ర‌తం చేయ‌డం వ‌ల్ల శరీరానికి విశ్రాంతి ల‌భిస్తుంది. అలాగే మౌన వ్ర‌తం చేయ‌డం వ‌ల్ల పంచేంద్రియాలు అన్నీ కూడా త‌మ ఆధీనం లో ఉంటాయి కాబ‌ట్టి.. భ‌గవంతున్ని నిష్ట గా ప్రార్థిస్తాం. దీని వ‌ల్ల భ‌గ‌వంతుని నుంచి పుణ్యం వ‌స్తుంది. అలాగే శ‌రీరానికి విశ్రాంతి ల‌భించ‌డం తో పాటు శ‌రీరానికి తెలియ‌ని శక్తి వ‌స్తుంది.

Visitors Are Also Reading