ఈ మధ్య కాలంలో సినిమాలో కంటెంట్ ఉంటే తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ పడటం లేదు. ఇక అలా కంటెంట్ తో వచ్చి రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా సీతారామం. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో సుమంత్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక ఈ చిత్రానికి వైజయంతీమూవీస్ బ్యానర్ నిర్మించగా ప్రేమకథలను తీయడంలో దిట్ట అయిన దర్శకుడు హనురాఘవపూడి దర్శకత్వం వహించారు.
Advertisement
ఈ సినిమా ప్రేక్షకులకు తెగనచ్చేసింది. బ్యూటిఫుల్ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని భాషల్లోనూ కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో పరిచయం లేకుండా ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకోవడం….ఎమోషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులకు తెగనచ్చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ దర్శకుడు ఓ లాజిక్ ను మిస్ చేశాడు. అయితే సినిమా థియేటర్ లో చూసినప్పుడు ఆ లాజిక్ ను ఎవరూ గమనించలేదు.
Advertisement
కానీ రీసెంట్ గా ఈ సినిమా థియేటర్ లలో విడుదలయ్యింది. ఇక థియేటర్ లలో సినిమాను చూసిన ప్రేక్షకులు లాజిక్ లను కూడా పట్టుకుంటున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాకిస్థాన్ జైలులో బందీగా ఉన్న సమయంలో తన భార్యకు ఉత్తరం రాస్తారు. ఆ లెటర్ రష్మిక తీసుకుని చేర్చాల్సి ఉంటుంది. అయితే లెటర్ లో అడ్రస్ సీతాదేవి అని రాస్తాడు.
కానీ లెటర్ లో చివరన ప్రిన్సెస్ నూర్ జహాన్ అని రాస్తాడు. అంటే తన భార్య నూర్ జహాన్ అని తెలిసినప్పటికీ అడ్రస్ సీతాదేవి అని రాయడంతో లెటర్ చేర్చడానికి రష్మిక తెగ కష్టపడుతుంది. ఇక ఈ లాజిక్ ను పట్టుకున్న నెటిజన్లు ముందే అడ్రస్ లో నూర్ జహాన్ అని రాస్తే సరిపోయేదికదా ఎందుకు కష్టపెట్టావ్ భయ్యా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.