Ad
మన దేశంలో తల్లిదండ్రులు ఎక్కువగా తమ పిల్లలను చదువు వైపే నడిపిస్తారు. కానీ ఆటల వైపుకు మాత్రం పంపారు. కానీ ఇప్పుడిపుడే ఈ పద్దతి అనేది మారుతుంది. తమ పిల్లలను ఆటల వైపు అమ్మ నాన్న ఎంకరేజ్ చేస్తున్నారు. అయిన కూడా మన దేశం ఎందుకు ఆటల్లో నెంబర్ వన్ కావడం లేదు… 130 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఇండియాలో సరైన ప్లేయర్స్ లేరా అంటే అది తప్పు అవుతుంది.
ఇండియాలో టాలెంట్ ఉన్నా.. వారికీ వసతులు అనేవి సరిగ్గా ఉండవు. ముఖ్యంగా మహిళలకు మాత్రం అసల్లే వసతులు ఉండవు. ఇప్పుడు దీనికి పరాకాష్టగా.. ఓ వీడియో అనేది ట్రెండ్ అవుతుంది. అదే మహిళా క్రీడాకారులకు.. పురుషుల టాయిలెట్ లో భోజనం అనేది పెట్టారు. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.
అయితే ఈ నెల ఉత్తరప్రదేశ్ లోని సహ్రాన్‌పూర్ లో ఈ నెల 16 నుంచి 18 వరకు అక్కడ అండర్ -17 బాలికల కబడ్డీ పోటీలు జరిగాయి. సమయంలో అక్కడికి మొత్తం 17 జట్ల నుండి 200 వరకు మహిళా ప్రిడాకారులు వచ్చారు. కానీ వారికీ మధ్యాహ్నం భోజనం అనేది పురుషుల టాయిలెట్ లో పెట్టారు. ఈ ఘటన అనేది ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సిసిల మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై రాజకీయనాకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
రోహిత్ కోపానికి కారణం ఏంటో తెలుసా..?
పురుషుల కంటే ముందు పాకిస్థాన్ తో తలపడనున్న భారత మహిళలు..!
Advertisement