నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు ఇండస్ట్రీనే ఒక పొజిషన్ లో నిలబెట్టిన గొప్ప నటుడు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే భావంతో ఆయన బ్రతికి ఉన్నన్ని రోజులు ఏనాడు కూడా హద్దులు మీరి ఎవరినీ నొప్పించలేదు. తను ఎలా గౌరవంగా జీవించారో, అలాంటి గౌరవ మర్యాదలు తన పిల్లలకు కూడా నేర్పారని చెప్పవచ్చు.. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణకు, ఆ సినిమాలో మాత్రం ఎన్టీఆర్ మూడు కండిషన్లు పెట్టారట.. అవేంటో చూద్దాం..? కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “మంగమ్మగారి మనవడు” సినిమా వెనుక ఒక ఆసక్తి కరమైన విషయం దాగి ఉంది. భార్గవ ఆర్ట్స్ అధినేత గోపాల్ రెడ్డి కోడి రామకృష్ణ ఇద్దరు కలిసి “మనువాసనై” అనే తమిళ మూవీ చూసి తెలుగులో రీమేక్ చేయాలని భావించారట.
Advertisement
ALSO READ;కృష్ణంరాజు కోసం 12 ఏళ్ల తరువాత తొలిసారి ప్రభాస్ అక్కడికి..
Advertisement
ఇందులో బాలకృష్ణ హీరో అయితే బాగుంటారని అనుకున్నారు. ఆ సమయంలో బాలయ్యతో సినిమా అంటే ఎన్టీఆర్ కి ముందు కథ చెప్పాలి. కథ విన్న ఎన్టీఆర్ ను కథ అంతగా ఆకట్టుకోలేదని, తర్వాత బాలకృష్ణను కలిసి ఒకసారి కథ వినమని అడిగితే బాలయ్య కథ విని, ఎన్టీఆర్ కు మరోసారి కథ వినాలని చెప్పారట. ఇక చివరిగా ఎన్టీఆర్ మరోసారి కథ విని, సినిమాలో బామ్మ పాత్రను పెంచి భానుమతి గారి తో ఆ రోల్ చేస్తే సినిమా హిట్ అవుతుందని సలహా ఇచ్చారట ఎన్టీఆర్.. ముందు దీనికి భానుమతి ఒప్పుకోలేదట. కానీ ఎన్టీఆర్ ఫోన్ చేసి ఒప్పించరట. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యే సమయంలో ఎన్టీఆర్ బాలకృష్ణ కు మూడు కండిషన్స్ పెట్టారట..
#1.ఇందులో మొదటిది భానుమతి షూటింగ్ స్పాట్ కు రావడానికి అరగంట ముందే నువ్వు అక్కడ ఉండాలని అన్నారట..
#2. అలాగే ఆమె షూటింగ్ స్పాట్ కు రాగానే ఆమె కారు దగ్గరికి వెళ్లి డోరు తీయాలని చెప్పారట.
#3. అలాగే భానుమతి కిందకు దిగగానే కాళ్లకు నమస్కారం చేయాలని ఎన్టీఆర్ బాలకృష్ణ కు ఈ మూడు కండిషన్స్ పెట్టారట.. తన నాన్న మాట ప్రకారమే బాలయ్య సినిమా పూర్తయ్యేవరకు అలానే చేస్తూ వచ్చారని, ఓ రోజు బానుమతి ఇలా చేయమని మీ నాన్న గారు చెప్పారా, పెద్దలను గౌరవించే లక్షణం నీకు ఉంది పైకి వస్తావ్ అని దీవించారట. దీంతో మంగమ్మగారి మనవడు సినిమా సూపర్ హిట్ అయింది.. బాలకృష్ణ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది..
ALSO READ;