కొన్ని సినిమాలను దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తీస్తుంటారు. అలాంటి సినిమా ఇప్పటి వరకూ మనవాళ్లు చూసి ఉండకూడని అనుకుంటారు. అయితే అలా ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమాలు కూడా కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. కొన్నిసార్లు అలాంటి సినిమాలు ఫ్లాప్ అయినా కొంతమంది అప్డేట్ గా ఆలోచించేవాళ్లు మాత్రం దాన్ని ఓ ఎపిక్ లా చూస్తుంటారు.
Advertisement
అలాంటి సినిమాల లిస్ట్ మహేశ్ బాబు టక్కరి దొంగ సినిమా కూడా ఉంది. 2002లో ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. జయంత్ సీ పరాంజి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కేఎస్ రామారావు మొదట నిర్మాతగా అనుకున్నారు కానీ ఆయన తప్పుకోవడంతో జయంత్ సొంతంగా సినిమాను నిర్మించారు. కౌబాయ్ తరహా లో ఈ అడ్వంచర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కథను మొదట జయంత్ ఫారిన్ లో ఉన్న మహేశ్ బాబుకు చెప్పారు.
Advertisement
కథ విని ఫిదా అయిన మహేశ్ బాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కాకుండా రిస్క్ లా కూడా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి అని చెప్పారట. మరోవైపు బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తాను ఒకవేళ లాభాలు వస్తేనే నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి అంటూ కూడా మహేశ్ బాబు ఆఫర్ ఇచ్చారట.
ఇక ఈ సినిమా గురించి మహేశ్ బాబు తన తండ్రి కృష్ణకు చెప్పగా ఆయన వార్నింగ్ ఇచ్చారన్న సంగతి చాలా మందికి తెలియదు. మహేశ్ బాబు కృష్ణ వద్దకు వెళ్లి టక్కరి దొంగ గురించి చెప్పగా…తాను నటించిన మోసగాళ్లు సినిమాను గుర్తు చేశారట. ఆ సినిమాకు హిట్ టాక్ వచ్చినా పెద్దగా వసూళ్లు రాలేదని కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలని వార్నింగ్ ఇచ్చారట. ఇక సూపర్ స్టార్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది.
ALSO READ: మంచు మనోజ్, భూమా మౌనికల రెండో పెళ్ళికి ఉన్న అసలు అడ్డంకి అదేనా?