చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది విద్యార్థినులు స్నానం చేస్తున్న వీడియోను వారి స్నేహితురాలు బాయ్ ఫ్రెండ్ కలిసి సీక్రెట్ గా చిత్రించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ ఘటన దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఇలాంటి ఘటనలే ఘతంలోనూ చోటుచేసుకున్నాయి. దాంతో మహిళలు యువతులు పబ్లిక్ టాయిలెట్ విషయంలో ఆందోళన చెందుతున్నారు.
Advertisement
కాగా కొన్ని టిప్స్ ద్వారా రహస్యంగా బాత్రూమ్ లో కెమెరాలు అమర్చి ఉంటే వాటిని గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…వాష్ రూమ్ ను ముందుగా జాగ్రత్తగా పరిశీలించాలి. చుట్టు పక్కల పైన ఏవైనా ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నాయా చూడాలి. ముఖ్యంగా పైన కెమెరాలు అమర్చే ప్రమాదం ఉంది కాబట్టి పైన చూడాలి.
Advertisement
టిష్యూ బాక్స్ లో ఎవరూ పరిశీలించరు. అక్కడ కూడా కూడా కెమెరాలు పెడతారని ఊహించరు. కానీ టిష్యూ బాక్స్ లలో కూడా కెమెరాలను అమర్చే ప్రమాదం ఉందట. కాబట్టి టిష్యూ బాక్స్ లను కూడా ఖచ్చితంగా పరిశీలించాలి. మెబైల్ ఫోన్ ల ద్వారా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని గమనించవచ్చు.
మెబైల్ తో ఫోన్ చేసినప్పుడు కాల్ కు అంతరాయం కలిగితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్టు అనుమానించాలి. ఫోన్ కెమెరాతో కూడా సీక్రెట్ కెమెరాలు అమర్చి ఉన్నట్టయితే గుర్తించవచ్చు. మీ ఫోన్ కెమెరా సహాయంతో సీక్రెట్ కెమెరాల నుండి వచ్చే ఇన్ ఫ్రారెడ్ కిరణాలను గుర్తించవచ్చు. కాబట్టి ఏదైనా అనుమానం వస్తే మీ ఫోన్ కెమెరా తో చెక్ చేయడం మంచింది.