Home » మీ లైఫ్ పార్ట్నర్ చెప్పేవి అబద్ధాలా…? నిజాలా…? ఈ 5 సూచనలతో తెలుసుకోండి…!

మీ లైఫ్ పార్ట్నర్ చెప్పేవి అబద్ధాలా…? నిజాలా…? ఈ 5 సూచనలతో తెలుసుకోండి…!

by AJAY
Ad

అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నవాళ్ళని చాలా మంది దూరం పెడతారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు చెప్పే మాటలతో ఇబ్బందులు ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పలేం. కాబట్టి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని భావిస్తారు. అయితే కొంతమంది అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవాలి అంటారు. కానీ అలా పెళ్లి చేసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు తప్పవు. అంతే కాకుండా కొంతమంది పెళ్లి తరావత కూడా తమ పార్టనర్ లకు అబద్ధాలు చెబుతూ ఉంటారు. కాబట్టి తమ పార్టనర్ అసలు అబద్ధాలు చెబుతున్నారా…లేదంటే నిజాలు చెబుతున్నారా అనే విషయం ముందుగా తెలుసుకోవాలట. అలా అబద్ధాలు చెప్పే వాళ్ళను కొన్ని సూచనల ద్వారా తెలుసుకోవచ్చు అని మానసిక నిపుణులు చెబుతున్నారు.


అబద్దం చెప్పే వాళ్ళను ఏదైనా అడిగితే పొంతన లేకుండా సమాధానాలు చెబుతారట. ఒకటి అడిగితే మరొకటి చెబుతూ తడబడతారట.

Advertisement

Advertisement

అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎక్కువగా ప్రామిస్ చేస్తూ ఉంటారట. ముక్యంగా వాళ్ళు అబద్దం చెప్పిన ప్రతి సారి ప్రామిస్ వేస్తారట. ఎక్కువగా అబద్ధాలు చెప్పేవాళ్లు ప్రామిస్ అంటూ ఉంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

అబద్ధాలు చెప్పే వాళ్ళు సమాధానం దాటవేయడానికి ప్రయత్నిస్తారట. వాళ్ళు తప్పు చేసిన ప్రతి సారి సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తారట.

అంతే కాకుండా అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా సెక్యూర్డ్ గా ఉంటార‌ట‌. వాళ్ల ఫోన్ ను అస్స‌లు ముట్టుకోనివ్వ‌ర‌ట‌. అంతే కాకుండా ఫోన్ కు ఎక్కువ పాస్ వ‌ర్డ్ లు పెట్టుకుంటార‌ట‌. వ్య‌క్తిగ‌త విష‌యాలకు సంబంధించిన వాటిని చాలా సెక్యూర్డ్ గా ఉంచుతార‌ట‌.

అబ‌ద్దం చెప్పేట్పుడు కుదురుగా ఉండ‌లేర‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. భ‌యంగా ఆందోళ‌న‌గా క‌నిపిస్తార‌ట‌. వాళ్ల ముఖ‌క‌వ‌లిక‌ల‌ను బ‌ట్టే గుర్తు ప‌ట్ట‌వ‌చ్చ‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు.

Visitors Are Also Reading