ప్రస్తుతం గుండెపోటుతో మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. మారినజీవన శైలి…ఆహారనియమాలు..పని ఒత్తిడి రకరకాల కారణాల వల్ల గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభస్తున్నాయి. చిన్న వయసులోను గుండె పోటు వచ్చి చనిపోతున్న సంఖ్య కూడా పెరుగటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు వయసు మీదపడిన వారికి ఆరవై నుండి డెబ్బై ఏళ్ల మధ్య గుండె పోటు మరణాలు సంభవించేవి కానీ ఇప్పుడు ఇరవై ఏళ్ల వయసులోనూ గుండె పోటు వచ్చి మరణించడం చూస్తూనే ఉన్నాం. సినీ పరిశ్రమలోనూ పలువురు తారలు గుండె పోటుతో చిన్న వయసులోనే మృతి చెందారు.
Advertisement
రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా మరణించింది గుండె పోటు కారణంగానే…అంతే కాకుండా బిస్ బాస్ విన్నర్ బాలీవుడ్ నటుడు ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న సిద్దార్థ్ శుక్లా కూడా చిన్న వయసులో గుండె పోటు కారణంగా మరణించారు. అయితే సరైన సమయానికి చికిత్స అందుతే గుండె పోటు వచ్చిన వారిని ప్రాణాలతో రక్షించుకోవచ్చు. అంతే కాకుండా గుండె పోటు వచ్చిన వారికి వెంటనే సీపీఆర్ చేసినా వారిని కాపాడుకోవచ్చు.
Advertisement
సీపీఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసక్సిటేషన్ ఈ టెక్నిక్ లో గుండె పోటు వచ్చిన వెంటనే వ్యక్తికి ఛాతి మధ్యలో అరచేతులు ఒకదానిపై మరొకటి పెట్టి గట్టిగా కిందకు అదమాలి. అలా ఒకనిమిషంలో వందసార్లు చేస్తూ మధ్య మధ్యలో మూడు సార్లు శ్వాసకు అవకాశం ఇవ్వాలి. ఇదిలా ఉంటే మన దేశంలో గుండెపోటు తో మరణించే వారి సంఖ్య పెరుగుతున్నా ఈ టెక్నిక్ మాత్రం 98 శాతం ప్రజలకు తెలియదట. దాంతో ఆస్పత్రికి వెళ్లే లోపే ఆరవై శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారట.