Home » కరీనాకు తలనొప్పిగా మారిన కత్రినా పెళ్లి !

కరీనాకు తలనొప్పిగా మారిన కత్రినా పెళ్లి !

by Bunty
Ad

కొత్త జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ లకు చాలా మంది సెలెబ్రిటీలు విషెస్ అందించారు. పెళ్లి సందర్భంగా కత్రినా, విక్కీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పోస్ట్ చేసిన వారిలో కరీనా కపూర్ ఖాన్ కూడా ఒకరు. “దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు” అంటూ కరీనా చేసిన ట్వీట్ ఆమెపై ట్రోలింగ్ కు దారి తీసింది. కరీనా ఆ పోస్టు చేసిన వెంటనే అందరి కళ్ళు బెబోపై పడ్డాయి. కత్రినా కైఫ్‌ గుర్తు రావడానికి ఇంత సమయం పట్టిందా ? అంటూ మొదలెట్టారు నెటిజన్లు.

Katrina Kaif-Vicky Kaushal Wedding Highlights: Couple embarks on a new journey as husband & wife - The Economic Times

Advertisement

Advertisement

గతంలో కరీనా బంధువు అయిన రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఆరు సంవత్సరాల సుదీర్ఘ రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత విడిపోవాలని డిసైడ్ అయ్యారు. వారి నుంచి ఈ న్యూస్ రావడం చాలా మంది అభిమానుల హృదయాలుకలచి వేసింది. అప్పటి నుండి ఈ జంట మాట్లాడటం లేదు. రణబీర్, కత్రినా విడిపోయినప్పటి నుండి కరీనా ఆమెకు దూరంగా ఉంది. ఆమె ఒకసారి రణబీర్‌తో ఒక ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ తాను స్నేహితులను సంపాదించడానికి ఇక్కడకు రాలేదని, చాలా మందిని ద్వేషిస్తున్నానని చెప్పింది. అయితే బెబో అప్పుడు ఇన్ డైరెక్ట్ గా కత్రినానే అన్నదని నెటిజన్లు అంటున్నాడు. ఏదేమైనా ఇప్పుడు ఆమె తన మనసు మార్చుకుని ఇప్పుడు కత్రినాను అనుసరించడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. కాగా అలియా భట్, టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్, సమంత, రకుల్ ప్రీత్, జాన్వీ కపూర్ సహా పలువురు సెలబ్రిటీలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Visitors Are Also Reading