ఆచార్య చాణక్యుడు ఒక ఆర్థికపరంగా మానసికంగా మనిషి ఎలా ఎదగాలి అనే విషయాలను తన చాణక్య నీతి ద్వారా చాలా వివరంగా చెప్పాడు. ఇప్పుడు చాలా మంది లైఫ్ కోచ్ లు ఉన్నప్పటికీ చాణక్యనీతికి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది. చాణక్యనీతిని తమ జీవితాలలో పాటించేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. కాగా చాణక్యుడి చాణక్యనీతి ద్వారా ఆర్థిక ఇబ్బందులు వచ్చేముందు ఇంట్లో మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని తెలిపాడు. ఆ సంకేతాలే ఏవో ఇప్పుడు తెలుసుకుందాం….
Advertisement
ప్రతి హిందువు ఇంట్లోనూ తులసి మొక్కలు ఉంటాయి. కాగా తులసి మొక్క పచ్చగా ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయట. కానీ తులసి మొక్క ఎండిపోవడం మొదలైతే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని చాణక్యుడు పేర్కొన్నాడు. అంతే కాకుండా ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నాట్యం చేస్తుందట. కానీ ఇంట్లో గొడవలు పడటం లాంటివి జరిగితే లక్ష్మి అనుగ్రహం ఉండదట.
Advertisement
ఎంత కష్టపడినా చిల్లిగవ్వ కూడా చేతిలో ఉండదట. కాబట్టి ఇంట్లో గొడవలు కూడా ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని చాణక్యుడు పేర్కొన్నారు. అదేవిధంగా శుభ్రంగా లేని ఇంట్లో కూడా ఉండేందుకు లక్ష్మీదేవి ఇష్టపడదట. ప్రతి రోజు పూజ చేస్తూ శుభ్రంగా ఉండే ఇంట్లోనే ఉండేందుకు లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతుందట.
కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకుని పూజలు చేయాలని చాణక్యుడు పేర్కొన్నాడు. అదేవిధంగా ఇంట్లో పగిలిన అద్దాన్ని అస్సలు పెట్టుకోవద్దట. పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే దరిద్రం వెంటాడుతుందని చాణక్యుడు తెలిపాడు. పగిలిన అద్దంలో ముఖం చూసుకుని ఏదైనా పనికి వెళితే ఆ పని ఖచ్చితంగా జరగదని చెప్పాడు.