దక్షిణాది చిత్రాలతో పాటుగా ఉత్తరాది బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఏకైక నటి పూజా హెగ్డే. డీజే సినిమాతో పూజా లక్ మారిపోయింది. వరసగా సినిమాలు చేస్తూ బిజీ తారగా మారిపోయింది. తమిళంలో విజయ్‌తో కలిసి బీస్ట్ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమాలో ఆమె పాత్రను కంప్లీట్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పూజా తెలియజేసంది.
సన్ పిక్చర్స్ బ్యానరపై దర్శకుడు నెల్సన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తికావొచ్చింది. బీస్ట్ సినిమాకు సంబంధించి చిత్రీకరణంతా పూర్తయిందని, ఈ సినిమాకు పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పింది పూజా. యూనింట్ అంతా కష్టపడి, ఇష్టపడి, ప్రేమించి సినిమా చేశామని, థియేటర్స్‌లో సినిమాను చేసే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుందని తెలిపారు. పూజా నటించిన సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. జనవరి 14న రాధేశ్యామ్, ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ కానున్నాయి. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రానని రిలీజ్ చేయనున్నారు. లక్‌తో పాటుగా అవసరమైనంత గ్లామర్‌ను ఒలకపోసేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు పూజా. స్టార్ హీరోలతో చేస్తున్న సినిమాలు హిట్ అవుతుండటంతో అడిగినంత రెమ్యునరేషన్‌ను కాదనకుండా ఇస్తున్నారు నిర్మాతలు.
Advertisement