తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తిరుమల దేవస్థానానికి ఎంతో.. చరిత్ర ఉంది. నిత్యం భక్తుల రాకతో.. భారత దేశంలోనే అత్యంత ధనవంతుడు ఏమైనా దేవుడిగా తిరుమల శ్రీవారు ఎదిగారు. అయితే నిత్యం కోట్లల్లో ఆదాయం వస్తుంది శ్రీవారికి. ఈ నేపథ్యంలోనే.. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు అరుదైన ఆభరణాన్ని విరాళంగా అందించారు.
Advertisement
Advertisement
శ్రీవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో చేయించిన బంగారు కటి మరియు వరద హస్తాలను శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో… టిటిడి అదనపు ఈవో ఏ విధం రెడ్డికి అందించారు అజ్ఞాత దాత. ఆలయంలోని మూలవిరాట్ కు అలంకరించేలా ఆ ఆభరణాలను ప్రత్యేకంగా చేయించారు.
5.5 కిలోల బరువు గల బంగారు హస్తాల తయారీకి ఏకంగా మూడున్నర కోట్ల విలువ ఉంటుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. శ్రీవారికి స్వర్ణ కటి మరియు వరద హస్తాలను అలంకరించనున్నారు శ్రీవారి ఆలయ అర్చకులు. భక్తితో చేసిన విరాళం అని… తన పేరు ప్రచారం అవసరం లేదంటూ దాత కోరడంతో.. అతని పేరును చాలా గోప్యంగా ఉంచింది టీటీడీ పాలకమండలి.