డిసెంబర్ 8న తమిళనాడులోని కానూర్ వద్ద చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో సహా 13మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం 14మంది ఉండగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. దాంతో ప్రస్తుతం ఆయనకు బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వరుణ్ సింగ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వరుణ్ సింగ్ యావరేజ్ స్టూడెంట్ లను ఉద్దేశించి ఈ యేడాది సెప్టెంబర్ 21న రాసిన లేఖ వైరల్ అవుతోంది. వరుణ్ సింగ్ తన పాఠశాల ప్రిన్సిపల్ కు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. వరుణ్ సింగ్ చండీ టెంపుల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు.
Advertisement
ఆయన తన లేఖలో…మీరు ఒకవేళ యావరరేజ్ స్టూడెంట్ అయితే బాధపడకండి. మీరు ర్యాంకర్ అయితే మీకు అభినందనలు. కానీ చదువులో రాణించలేకపోయినా బాధపడాల్సిన అవసరంలేదు. నేను కూడా చదువులో యావరేజ్ స్టూడెంట్ నే చదువులో ఎప్పుడూ టాప్ మార్కులు రాలేదు. డిఫెన్స్ అకాడమీలో ఉన్నప్పుడు చదువులో క్రీడల్లోనూ రాణించలేదు. మీకు సంగీతం..రచన ఎందులో ఆసక్తి ఉందో అందులో రాణించేందుకు కృషి చేయండి. నన్ను స్క్వాడ్రన్‌లో యువ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించిన్పుడు చాలా కంగారుపడ్డాను అప్పుడు నాకు ఓ విషయం అర్థం అయ్యింది.
Advertisement
also read : బిపిన్ రావత్ దంపతులకు నివాళ్లర్పించిన రాజ్ నాథ్, షా…!
నేను మనసు బుద్ది కేంద్రీకరిస్తే అధ్బుతంగా పనిచేయగలను అని తెలిసివచ్చింది. ఆ రోజు నుండి అద్భుతంగా పనిచేయడం మొదలు పెట్టాను. నాకు విమానాల పట్ల ఆసక్తి ఎక్కువ అలా నేను ఎదిగాను. మార్కులు మన జీవితానికి కొలమానం కావు. అంటూ వరుణ్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్ అలా తన లేఖలో విద్యార్థులకు ఎంతో ధైర్యం చెప్పారు. దాంతో ప్రస్తుతం వరుణ్ సింగ్ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.