హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సీడీసీ చీఫ్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక దంపతుల మృతదేహాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు నివాళులు అర్పించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్… ఆర్మీ చీఫ్ సవరణె, ఐఏఎఫ్ చీఫ్ చౌదురిలు శ్రద్దాంజలు ఘటించారు. బిపిన్ దంపతుల మృతదేహాల వద్ద పుష్ఫ గుచ్చాలు పెట్టి ఆర్మీ అధికారులు నివాళులు అర్పించారు. ఇక ఈ రోజు బిపిన్ రావత్ మధులిక భౌతిక కాయాలను వారి అధికారిక నివాసం కామరాజ్ మార్గ్ కు తరలిస్తారు.
Advertisement
అంతే కాకుండా మద్యాహ్నం 12 30 గంటలకు ప్రముఖులు మరియు ప్రజలు శ్రద్ధాంజలి ఘటించే అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియాగాంధీ కేంద్రమంత్రులు, ఎంపీలు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు కామరాజ్ మార్గ్ లోని బిపిన్ రావత్ నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 5గంటలకు అంత్యక్రియలను పూర్తిచేయనున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 13 మంది మరణించగా కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు ఆస్పత్రికి తీసుకెళ్లనున్నారు.
Advertisement