ప్రతి పర్వ దినాల్లో సాధారణం గా గడప ల కు మామిడి తోరణాల ను కడుతారు. వాటిని ఎందుకు కడుతారో కారణం తెలియక పోయినా.. చిన్న పిల్లల నుంచి పెద్ద ల వరకు గడప లకు మామిడి తోరణాలు కట్టాలని ప్రతి ఒక్కరి తెలుసు. అయితే తమ ముందు తరం వాళ్లు కట్టారని తాము కడుతున్నామని.. అని కొందరు. అలాగే మరి కొందరు అందరూ కడుతున్నామని తాము కడుతున్నామని అని కారణాలు చెబుతూ ఉంటారు. అయితే నిజానికి గడప లకు మామిడి తోరణాలు కట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అది ఆధ్యాత్మికం గా కారణాలు ఉన్నాయి.. అలాగే సైన్స్ పరం గా కూడా పలు కారణాలు ఉన్నాయి.
Advertisement
Advertisement
ముందుగా ఆధ్యాత్మికం గా చూస్తే.. ప్రతి ఇంట్లో పండుగ సమయం లో గడప లకు పసుపు, కుంకుమ రాసి బొట్టు పెడుతారు. అలాగే గడప ల పైనా.. పచ్చటి మామిడి తోరణాల తో అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో కి ధన లక్ష్యీ తో పాటు దేవుళ్లు కూడా.. మన ఇంట్లో కి వస్తారని పండితులు చెబుతూ ఉంటారు. ఇంటి అలంకరణ ఎంత ఉంటే.. అంతలా దేవుళ్లు ఇంట్లో కి వచ్చే అవకాశాలు ఉంటాయని వేద పండితులు చెబుతారు. అలాగే దిష్టి ని తొలగించడానికి మామిడి తోరణాలు కడుతారని కొంత మంది అంటుంటారు. అలాగే మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంటి కి సౌభాగ్యం వస్తుందని పండితులు కూడా చెబుతారు. అందుక ని ఆధ్యాత్మికం గా మామిడి తో రణాల ను ఇంటి ముందు ఉంచుతారు.
అలాగే ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టడానికి సైన్స్ పరం గా కూడా పలు కారణాలు ఉన్నాయి. పర్వ దినా ల లో ఇంటి లో ఎక్కువ మంది ఉంటారు. ఇరుకు అయిన ప్రదేశం లో ఎక్కువ మంది ఉండటం వల్ల అక్కడ ఆక్సిజన్ స్థాయి తీవ్రం గా పడిపోతుంది. అలా పడి పోయిన ఆక్సిజన్ స్థాయి పచ్చటి మామిడి ఆకుల తో భర్తీ చేయడానికి మామిడి ఆకులను కడుతారు. సాధారణం గా మామిడి ఆకులు కొసిన తర్వాత కనీసం రెండు నుంచి మూడు రోజుల పాటు ఆక్సిజన్ ను అందిస్తాయి. ఈ కారణాలతో ఇంటి ముందు మామిడి తోరణాలు ను కడుతారు.