చిన్నకుటుంబం చింతలేని కుటుంబం అని చెబుతుంటారు. అయితే చిన్న కుటుంబాల వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనే విషయాలను పెద్దవాళ్లు వారి పిల్లలకు చెప్పేవారు. కానీ ప్రస్తుతం పెళ్లి అయ్యిందంటే ఉద్యోగాల కోసమో ఇతర కారణాల వల్లనో దంపతులు దూరంగా వెళ్లి సింగిల్ గా ఉంటున్నారు.
Advertisement
ఇక బిజీ లైఫ్ లో ఒకరినొకరు పట్టించుకోలేకపోవడం వల్ల ఇతర కారణాల వల్ల అక్రమసంబంధాలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు వారికి చెప్పేవాళ్లు లేకపోవడం వల్ల కూడా పక్కదారి పడుతున్నవాళ్లు ఉన్నారు. ఇక చాలా మంది తమ రిలేషన్ షిప్ సీక్రెట్ ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని లక్షణాలను బట్టి భార్య లేదా భర్త మరొకరితో ప్రేమలో ఉన్నారనే విషయాన్ని పసిగట్టవచ్చట.
Advertisement
అప్పటి వరకూ సాధారణంగా కనిపించవాళ్లు ఎక్కువగా అలంకరణ పై దృష్టిపెడితే వారు మరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు అనుమానించాలట. ఫోన్ కాల్ వచ్చినప్పుడు సాధారణంగా మాట్లాడేవారు. ఎప్పుడూ ఫోన్ చూడని వారు ఎక్కువగా ఫోన్ లలో మాట్లాడటం…చాటింగ్ లు చేయడం లాంటివి చేసినా కూడా అనుమానించాలట.
అంతే కాకుండా ఒకప్పుడు విమర్శలు చేయని వారు ఇప్పుడు ఏం చేసినా విమర్శించడం…చిన్న తప్పులను కూడా భూతద్దం లో పెట్టి చూడటం లాంటివి చేసేవాళ్లను కూడా అనుమానించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఆఫీస్ తరవాత ఇంట్లో ఉండే భర్తలు ఆఫీస్ కు వెళ్లి వచ్చిన తరవాత మళ్లీ బయటకు వెళ్లడం లాంటివి చేసినా కూడా అనుమానించాలని చెబుతున్నారు.