పూరీ జగన్నాత్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో కొన్ని క్రేజీగా ఉన్నాయని అనిపిస్తే కొన్ని మాత్రం అసలు ఎందుకు తీశాడు రా బాబు అనిపించేలా ఉంటాయి. ఇక రీసెంట్ వచ్చిన లైగర్ అయితే దారుణమైన టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పూరీ ఛార్మీ సహా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించారు.
Advertisement
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటించారు. అంతే కాకుండా సినిమాలో రమ్యకృష్ణ లైగర్ కు తల్లిగా నటించింది. ఇక ఈ సినిమా పై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతోనే పూరీ జగన్నాత్, విజయ్ దేవరకొండ లు పాన్ ఇండియాకు పరిచయం అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ సినిమా విడుదల తరవాత మాత్రం భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బోల్తా కొట్టింది.
Advertisement
ఇదిలా ఉండగా లైగర్ సినిమా షూటింగ్ దాదాపుగా ముంబైలో చిత్రీకరణ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూరీజగన్నాత్ సినిమా మొదలైన నాటి నుండి ముంబైలోనే ఉంటున్నారు. ఇక పూరీ ముంబైలో ఓ ఫ్లాట్ ను అద్దెకు తీసకున్నాడట.
ఆ ఫ్లాట్ అద్దె దాదాపుగా నెలకు 10 లక్షలు అంతే కాకుండా మెయింటెన్స్ తో కలిపి నెలకు 15లక్షలు చెల్లించాలి. అయితే ఇప్పుడు లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో పూరీకి బాలీవుడ్ లో అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. దాంతో చేసేది లేక పూరీ మళ్లీ తన మకాంను హైదరాబాద్ కు మార్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.