సినిమా ఇండస్ట్రీలో హీరోయన్ గ్లామర్ షో చేయకపోతే ఎక్కువకాలం నిలబడలేరని చాలా మంది భావిస్తారు. చాలా మంది హీరోయిన్ లు కూడా అందాల ప్రదర్శనకు సై అంటారు.
ఇవి కూడా చదవండి: భర్త భార్యకు ఎప్పటికీ చెప్పకూడని 5 విషయాలు ఏవో తెలుసా ? 3వది చాల ముఖ్యమైనది ..!
Advertisement
కానీ టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్ లు మాత్రం గ్లామర్ షో అస్సలు చేయకుండా నటనను నమ్ముకుని స్టార్ హీరోయిన్ లుగా చాలా కాలం పాటూ రాణించారు. ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం….
సుహాసిని టాలీవుడ్ లో స్టార్ హీరోయన్ గా రానించింది. తెలుగుతో పాటూ తమిళ చిత్రాలలోనూ స్టార్ హీరోయన్ గా కొనసాగింది. కానీ ఎప్పుడూ సుహాసిని గ్లామర్ షో మాత్రం చేయలేదు.
హీరోయిన్ శోభన కూడా తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది. తన అందంతో టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ అందాల ప్రదర్శన జోలికి మాత్రం ఎప్పుడూ వెళ్లలేదు.
సహజనటిగా పేరు సంపాదించుకున్న జయసుధ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. దాదాపు టాలీవుడ్ లోని అప్పటి స్టార్స్ అందరికీ జోడి కట్టింది. కానీ జయసుధ కూడా గ్లామర్ షోకు నో చెప్పింది.
Advertisement
ఇవి కూడా చదవండి: ఇక నుంచి ఢిల్లీలోని రాజ్‌పథ్ పేరు ఏంటో తెలుసా..?
భాను ప్రియ తనదైన నాచురల్ అందంతో అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి చిత్రపరిశ్రమలో చెరగని ముద్ర వేసుకుంది. కానీ ఎప్పుడూ అందాల ప్రదర్శన మాత్రం చేయలేదు.
అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సౌందర్య తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించింది కానీ స్కిన్ షోకు మాత్రం దూరంగానే ఉంది.
ఈ తరం హీరోయిన్ లలో అతితక్కువ మంది భామలు మాత్రమే గ్లామర్ షోకు దూరంగా ఉంటున్నారు. నాచురల్ గా అలరిస్తున్న బ్యూటీల్లో సాయిపల్లవి ముందుంటుంది. సాయిపల్లవి ఇప్పటి వరకూ గ్లామర్ ఓ చేయలేదు తన తరవాత చిత్రాలలోనూ చేయను అని ప్రకటించింది.
నిత్యామీనన్ కూడా గ్లామర్ షోకూ దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న లిస్ట్ లో ఉంది. ఇప్పటి వరకూ నిత్యా చాలా సినిమాలు చేసినా ఏ సినిమాలో కూడా అందాల ప్రదర్శన చేయలేదు.
ఇవి కూడా చదవండి: సమంత విడాకులపై ఆమె తండ్రి ఎమోషనల్ పోస్ట్..!