ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని పనులు చాలా ఈజీగా జరుగుతుంటే, మరి కొన్ని పనులు అనేక ఇబ్బందులు తీసుకొస్తున్నాయి.. మంచి కోసం సోషల్ మీడియాను వాడుకుంటే బాగుంటుంది కానీ, కొంతమందికి పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఎలాగైనా గుర్తింపు సాధించడం కోసం వివిధ రకాల పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు.. అయితే ఈ ప్రబుద్ధుడు కూడా అలాగే చేశాడు.. ఎలాగైనా ఫాలోవర్స్ ని పెంచుకోవాలని తన భార్య స్నానం చేస్తుండగా ఫోటోలు తీసి మరి సోషల్ మీడియాలో షేర్ చేశాడు..
Advertisement
ALSO READ:ఈ ముగ్గురు నటుల విషయంలో జరిగిన విచిత్రమైన ఘటన ఏంటో తెలుసా..?
Advertisement
తర్వాత ఏం జరిగిందో మన ఓసారి చూద్దాం.. కొంతమంది వారి టాలెంట్ ను బయట పెట్టుకోవడం కోసం సోషల్ మీడియా వేదికగా చేసుకొని చిన్నచిన్న వీడియోలు, ఫోటోలను షేర్ చేసి గుర్తింపు సంపాదించుకుంటారు.. కానీ కొంతమంది ఎలాగైనా ఫాలోయింగ్ పెంచుకోవాలని కుటుంబాన్ని కూడా బయట పడేస్తున్నారు.. ఈ వ్యక్తి కూడా తన భార్య ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ల్ ఉండే సర్కస్ లో పనిచేసే ఒక వ్యక్తి, అతని ఫేస్ బుక్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం తన భార్యకు తెలియకుండా ఆమె స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియో తీసి దాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేశాడు.
ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆయన భార్య సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె పోలీసులను ఆశ్రయించగా భయంతో తన ఫేస్ బుక్ ఖాతా ను పూర్తిగా డిలీట్ చేశాడు ఆ ప్రబుద్ధుడు. ఏది ఏమైనా సోషల్ మీడియా కొంత మందికి మేలు చేస్తుంటే మరికొంతమందికి మాత్రం వివిధ అనర్థాలను చేపిస్తుంది అని చెప్పవచ్చు. అనర్థాలకు కారణం కూడా మనమే అనే విషయాలను ప్రతి ఒక్కరు గమనించాలి.
ALSO READ:బాలయ్య సినిమాల్లో ఉండే ఈ కామన్ పాయింట్ ను గమనించారా..? అదేంటో తెలిస్తే జై బాలయ్య అనాల్సిందే..?