ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధర ల విషయం లో తీసుకున్న నిర్ణయం పై ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా వేడి తగ్గలేదు. ఇప్పటి కే చాలా మంది సినిమా ప్రముఖులు ఈ నిర్ణయం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. మొదట ఈ పంచాయితి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అప్పుడు ఎక్కువ మంది దీని పై నోరు మెదక పోయినా.. ప్రస్తుతం ఒకరి తర్వాత ఒకరు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.
Advertisement
Advertisement
సాయి ధరమ్ తేజ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలిజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ టికెట్ల ధర లపై చేసిన వాఖ్యలు అప్పట్లో పెను దుమారం లేపాయి. ఇటు సినిమా రంగం లో.. అటు రాజకీయ రంగం లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనాలు సృష్టించాయి. ఆయన తర్వాత చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తో పాటు సందర్భం వచ్చిన ప్రతి సారి చాలా మంది ప్రముఖులు టికెట్ ధరల పై స్పందిస్తూనే ఉన్నారు.
తాజా గా సీనియర్ నిర్మాత సీ. కాళ్యాణ్ కూడా టికట్ల ధరల విషయం లో ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ ను నాశనం చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో తెలుగు సినీ పరిశ్రమ తీవ్రం గా నష్ట పోతుందని అన్నారు. గతంలో ప్రభుత్వాలు సినీ పరిశ్రమ కు అనుకూలం గా నే ఉన్నాయని అన్నారు. కానీ నేటి జగన్ సర్కార్ మాత్రం సినీ పరిశ్రమ కు సమస్యలు తెస్తున్నారని అన్నారు.