టాలీవుడ్ లో మన్మథుడిగా నాగార్జునకు పేరు ఉంది. ఒకప్పుడే కాదు ఇప్పటికీ నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడుగా ఉన్నాడు. నాగార్జున ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కాగా తన అందంతో నాగ్ ఎక్కువగా లేడీ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రేమకథా చిత్రాలతో పాటూ మాస్ సినిమాలలో నటించారు.
Advertisement
కేవలం సాధారణ అమ్మాయిలే కాకుండా హీరోయిన్ లు సైతం నాగ్ అంటే పడి చచ్చిపోయేవారు. చాలా మంది హీరోయిన్ లకు నాగ్ క్రష్ గా ఉండేవారు. ఇక నాగార్జున అంటే హీరోయిన్ టబుకు చాలా ఇష్టమని అతడి కోసమే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అనే రూమర్ కూడా ఉంది. అంతే కాకుండా అప్పట్లో వీరిద్దరూ లవ్ లో ఉన్నారని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది.
Advertisement
వీరిద్దరూ కలిసి నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే సినిమాల్లో నటించారు. నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగ్ టబు ల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటుంది. నటిస్తున్నారా లేదంటే జీవిస్తున్నారా అన్నంత రేంజ్ లో వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాలో వర్కౌట్ అయ్యింది. ఈ సినిమా తరవతనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. చాలా కాలం పాటూ వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున టబుతో రిలేషన్ షిప్ పై స్పందించారు. టబుకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి తనకు పరిచయం అని చెప్పారు. తమది 20 ఏళ్ల స్నేహం అంటే జీవితంలో సగభాగం అని అన్నారు. టబు పేరు చెప్పగానే తన ముఖం వెలిగిపోతుందని టబు అందమైన స్నేహితురాలని చెప్పారు. మా రిలేషన్ షిప్ కు ఎలాంటి సంబంధం పెడతారో మీ విగ్నతకే వదిలేస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.