Mi-17 V 5 ప్రపంచంలో అత్యాధునిక మిలటరీ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్. 2013 నుంచి 2018 మధ్య 80 Mi-17 V 5 హెలికాప్టర్ లను కొనుగోలు చేసింది భారత్. ఈ మిలటరీ హెలికాప్టర్ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ హెలికాప్టర్ Mi-17V-5ను మీడియం-లిఫ్టర్ ఛాపర్ అని అంటారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత అధునాతన హెలికాప్టర్లలో ఒకటి.. ఛాపర్ యొక్క భద్రతా రికార్డు ప్రపంచంలోని కొన్ని ఇతర కార్గో ఛాపర్ల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ప్రమాదాలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి.
Advertisement
Mi-17V-5 అనేది Mi-8/17 హెలికాప్టర్ల శ్రేణికి చెందినది. మిలిటరీ ట్రాన్స్పోర్ట్ కోసం దీన్ని స్పెషల్ గా డిజైన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రదేశాల ఆర్మీలో ఈ రకం హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నారు అధికారులు. రష్యాకు చెందిన కజాన్ హెలికాప్టర్స్ సంస్థ వీటిని తయారు చేస్తుంది.. ఈ హెలికాప్టర్‌ను సైన్యం.. ఆయుధాల రవాణా, అగ్నిమాపక మద్దతు, కాన్వాయ్ ఎస్కార్ట్, పెట్రోలింగ్ , సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి వాటి కోసం ఉపయోగిస్తారు. ఇండియన్ ఆర్మీలో ఈ హెలికాఫ్టర్లు 80 ఉన్నాయి. Mi-17V-5 హెలికాఫ్టర్‌లో క్లిమోవ్ TV3-117VM లేదా VK-2500 టర్బో-షాఫ్ట్ ఇంజన్లు ఉంటాయి. 2,100 నుంచి 2,700 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌ను ఈ టర్బో షాఫ్ట్ ఇంజిన్లు ఉత్పత్తి చేస్తాయి.. ఈ హెలికాప్టర్ పూర్తి డిజిటల్ కంట్రోల్ సిస్టం తో ఉంటుంది.. గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఈ హెలికాప్టర్ ప్రయాణిస్తుంది..
Advertisement
అత్యధిక ఇంధన సామర్థ్యం ఉన్న ఈ హెలికాప్టర్ లో ఒక్క సారి ఫ్యూయల్ నింపితే ఐదు వందలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.. ఈ హెలికాప్టర్ లో రెండు పెట్రోల్ ట్యాంకులు ఉంటాయి.. రెండు పెట్రోల్ ట్యాంక్ లోని ఫ్యూయల్ తో వెయ్యి కిలోమీటర్ల వరకూ ఈ హెలికాఫ్టర్‌తో నిరంతరం గా ప్రయాణించవచ్చు.. ఈ హెలికాప్టర్ గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. Mi-17 రవాణా హెలికాప్టర్ ప్రయాణీకుల కోసం ప్రామాణిక పోర్ట్‌సైడ్ డోర్‌తో కూడిన పెద్ద క్యాబిన్‌ను ఉంటుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్, కార్గో ట్రాన్స్పోర్ట్ కోసం హెలికాప్టర్ వెనుకవైపు రాంప్ ఉంటుంది. ఈ హెలికాప్టర్ గరిష్టంగా టేకాఫ్ బరువు13,000 కిలోలు ఉంటుంది.. 36 మంది పెట్టె సామర్థ్యం కలిగి4,500 కిలోల బరువును మోయగలదని అధికారులు చెబుతున్నారు. క్లిష్ట పరిస్థితులలో కూడా సమర్థంగా పని చేస్తుంది.. యుద్ధ సమయంలో శత్రుదుర్బేద్యంగా పని చేస్తుంది..