రామాయణం లో రావణుడి గురించి అందరికీ తెలుసు.. ఆయన ఒక రాజ్యానికి రాజు గా ఉన్నా.. అతని చెడు గుణాలు మాత్రం ఎక్కువ గా ఉంటాయి. అయితే రావణుడి కి చెడు గుణాలు ఉన్నా.. పెద్ద మేధావి, అలాగే విధ్యా వంతుడు కూడా. అలాగే గొప్ప శివ భక్తుడు. అలాగే అతని భార్య మండోదరి మాత్రం రావణుడి లా కాకుండా గుణ వతి, శీల వతి. మంచి ని కోనుకునే వ్యక్తి. అయితే మండోదరి మాయ బ్రహ్మ కూతురు. అయితే రావణుడి మండోదరి పై మనసు పడి ఆమెను వివాహం చేసుకుంటాడు.
Advertisement
Advertisement
నావణుడి మండోదరి లకు ఇంద్ర జిత్తు అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే రావణుడు తనకు ఉన్న చెడు గుణాల వల్లే రాముడి సతిమణీ సీత ను ఎత్తుకు వచ్చాడు. దీంతో మొదట రావణా సురుడి కొడుకు ఇంద్ర జిత్తు ను రాముడి సోదరుడు లక్ష్మణుడు చంపెస్తాడు. దీంతో మండోదరి రావణుడి తో చెబుతుంది.. రాముడి తో యుద్దం వద్దని.. సీతను రాముడి కి ఇచ్చేయాలని మండోదరి రావణుడి తో చెబుతుంది. అయితే రావణాసురుడు భార్య మాట వినకుండా.. రాముడి తో యుద్ధం చేస్తాడు. ఈ యుద్దం లో రావణా సురున్ని రాముడు చంపేస్తాడు.
రావాణుడి మరణ వార్త తెలిసినా.. మండోధర వచ్చి రావణుడి మృత దేహాం తో ఇలా అంటుంది. నీవు చనిపోయింది.. రాముడి చేతిలో కాదు.. నీ ఇంద్రియాలే నిన్ను చంపాయని అంటుంది. అలాగే నీ కోరికలే నిన్ను ఇలాంటి పరిస్థితి కి తీసుకువచ్చాయని చెబుతుంది. అలాగే ఇంద్రియాలను, కోరికలను అదుపు లో ఉంచుకున్న వారే గోప్ప వ్యక్తి అవుతారని చెబుతుంది. ఇంద్రియానలు , కోరికలను అదుపు లో ఉంచుకోలేని వాడి జీవితం నాశనం అవుతుందని అంటుంది.