కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మూడేళ్ళుగా తిరుమలలో సుపరిపాలన జరుగుతుందని శ్రీవారి ట్రస్ట్ విధానం ద్వారా దళారి వ్యవస్థను అరికట్టడం అభినందనీయమని అన్నారు.
Advertisement
కేంద్ర హోం మంత్రి అమిత్ షాని నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ కలిశారు.
నేడు సాయంత్రం ఐదు గంటలకు ప్రియాంక గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. మునుగోడు ఎన్నికలపై ప్రియాంక జిల్లా నేతలు, పీసీసీ, సీఎల్పీ,ప్రచార కమిటీ చైర్మన్ లతో సమావేశం కానున్నారు. మునుగోడు అభ్యర్ధి ఎంపిక,ఎన్నికల వ్యూహం పై చర్చించనున్నారు.
రేపు ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులకు సన్మానం చేయనున్నారు. 3గంటల పాటు వైభవంగా ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. శంకర్ మహదేవన్ మ్యూజికల్ కాన్సర్ట్, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మజ రెడ్డి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చేయనున్నారు.
Advertisement
ఏపి సీఎం జగన్ నిన్న ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. నేడు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం భేటీ కానున్నారు.
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రం లో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్త దానం తో పాటు ఆస్పత్రులు ఇతర స్థలాల్లో సేవా కార్య్రమాలు నిర్వహిస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిస్తామో త్వరలో ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇప్పటికే సీపీఐ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 9,351 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది కరోనా తో మరణించారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. దాంతో పదమూడు మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.