నందమూరి హీరో బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయ పాటి కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ అఖండ. ఈ సినిమా తో నందమూరి బాలకృష్ణ తిరిగి ఫామ్ లో కి వచ్చాడు. రికార్డు స్థాయి కలెక్షన్ లతో బాక్సాఫీస్ ను బద్దలు కోడుతు బాలయ్య దూసుకుపోతున్నాడు. అయితే ఈ సినిమా లో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో కనిపించాడు. ఒకటి ఒక పాత్ర సాధారణం గా ఉంటే.. మరొక పాత్ర లో బాలయ్య అఘోరాల కనిపించాడు. అఖండ సినిమా మొత్తం లో బాలయ్య అఘోర గా ఎంట్రి ఇచ్చిన సీన్ హైలైట్ గా ఉంటుంది.
Advertisement
Advertisement
ఈ సీన్ కోసమే థీయేటర్ కు వెళ్లే వారి సంఖ్య పెద్ద గానే ఉందని సమాచారం. అయితే.. బాలయ్య అఘోర గెటప్ లో ఇంటర్వెల్ సమయం లో వస్తాడు. ఈ సీన్ కోసం చిత్ర బృందం భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. ఈ సెట్ కోసం చిత్ర నిర్మాతలు కూడా బాగానే ప్లాన్ చేశారని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సెట్ కోసం దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేశారట. ఈ విషయాన్ని ఈ సినిమా సంగీత దర్శకుడి గా ఉన్న ఎస్ ఎస్ థమన్ ఒక ఇంటర్వ్వూ లో తెలిపాడు.
అలాగే బాలయ్య ఊదే శంఖం కోసం కూడా ఒక ప్రత్యకత ఉందని ఎస్ ఎస్ థమన్ తెలిపాడు. పెళ్లి లలో శంఖం ఊదే అతనికి రెట్టింపు డబ్బుల ఇచ్చి.. మరి తీసుకువచ్చామని అన్నాడు. అలాగే ఈ సీన్ లో గబ్బిలాలు సహజం గానే వచ్చాయట. ఇది ఆ సీన్ కలిసొచ్చే అంశం అని హీరో బాలయ్య అన్నారు. కాగ అఖండ సినిమా లో ఈ శివుని సెట్ మాత్రం బిభత్సం గా నే ఉంది.