బాత్రూమ్ లోకి దూరిన 12 అడుగుల పాము అందరినీ హడలెత్తించింది. కింగ్ కోబ్రా జాతికి చెందిన పామును చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ సురేష్ టీమ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సురేష్ కింగ్ కోబ్రాను టాయిలెట్ కమోడ్‌లో దాక్కున్న కింగ్ కోబ్రాను బయటకు రప్పించేందుకు చాలా శ్రమపడ్డారు. కమోడ్ బయట ప్లాస్టిక్ పైప్‌ను కట్ చేసి దానికి అడ్డంగా గుడ్డను ఉంచారు. ఆనంతరం కమోడ్‌లో నీళ్లు పోశారు. అయితే, కమోడ్‌లో నీళ్లు పోసినప్పటికీ ఆ పాము బయటకు రాలేదు. లోపలే అలానే ఉండిపోయింది. తన వద్ద ఉన్న పరికరాలతో పామును మెల్లిగా బయటకు తీసుకొచ్చారు.
Advertisement
12 అడుగుల పొడవైన ఆపాము తోకను పట్టుకోవడంతో అది బుస్‌మని అతడిని కాటేయబోయింది. కానీ, సురేష్ జాగ్రత్తగా తప్పించుకొని తోక వదలకుండా గట్టిగా పట్టుకొని సంచిలో ఉంచేసి సమీపంలోని అడవిలో వదిలేశారు. కోబ్రా జాతికి చెందిన పాములను పట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే వాటి కాటుకు బలి కావొస్తుందని సురేష్ పేర్కొన్నారు. కోబ్రా జాతికి చెందిన పాము కాటేస్తే మనిషి 30 నిమిషాల్లోనే మరణిస్తాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో సోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
Advertisement