పెళ్లి వరకూ ఎలా ఉన్నా చెల్లుతుంది కానీ పెళ్లి తరవాత ఇద్దరి జీవితాలు ఒకరి జీవితంతో మరొకరి జీవితం ముడిపడి ఉంటాయి. కాబట్టి పెళ్లి తరవాత చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తలు కలిసి ఉండే ప్రదేశం ఇల్లు. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అరోగ్యం తో పాటూ పాజిటివ్ ఎనర్జీ సొంతం అవుతుంది. అంతే కాకుండా బెడ్ రూమ్ ను కూడా శృభ్రంగా ఉంచుకోవాలి. ఉమ్మడి కుటుంబంతో ఉన్న సమయంలో భార్య భర్తలు ఎక్కువగా బెడ్ రూమ్ లోనే ఉంటారు.
Advertisement
కాబట్టి ఆ గదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతే కాకుండా వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో కొన్ని వస్తువులు ఉంటే గొడవలు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పడు చూద్దాం… బెడ్ రూమ్ పెయింటింగ్ విషయానికి వస్తే థిక్ కలర్స్ ను వాడకూడదట. అలా థిక్ కలర్స్ ఉండటం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంటుందని కాబట్టి లైట్ కలర్స్ ను ఉపయోగించాలని చెబుతున్నారు. ఆఫీస్ కు సంబంధించిన ఫైల్స్ ను బెడ్ రూమ్ లో అస్సలు ఉంచకూడదు.
Advertisement
అలా ఉంచడం వల్ల మూడ్ డిస్ట్రబ్ అవుతుంది. అంతే కాకుండా బెడ్ రూమ్ లో టీవీని సైతం పెట్టుకోకూడదట. కొంతమంది బెడ్ రూమ్ ను స్టోర్ రూమ్ లా వాడుతూ పనికిరాని వస్తువులు అందులో పెడుతుంటారు. అలా పనికిరాని వస్తువులు పెట్టడం వల్ల గొడవలు జరుగుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
పువ్వుల వాసన ఎలాంటి మూడ్ ను అయినా రిపేర్ చేస్తుంది కాబట్టి బెడ్ రూమ్ మంచి పూల వాసన వచ్చే పర్ఫ్యూమ్ లను వాడాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బెడ్ రూమ్ ఏ షో పీస్ లు పెట్టినా జతగా పెట్టాలట. పూల కుండీలు, బొమ్మలు ఇలా ఏవి పెట్టినా జతగానే ఉంచాలట. బెడ్ రూమ్ లో దేవుడి ఫోటోలను మాత్రం అస్సలు పెట్టకూడదట. అంతే కాకుండా బెడ్ రూమ్ లో ఇంటి లెక్కల గురించి కూడా ప్రస్థావన తీసుకురావద్దట.