ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా… ఇప్పటికే చాలా రంగాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. ఇక ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు… వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రక్రియను… అన్ని దేశాలు సమర్థ వంతంగా అమలు చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… కరోనా ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు అడుగు ముందుకేశారు. మనం నిత్యం తినే.. చూయింగ్ గమ్ తో కరోనా కు చెక్ పట్టవచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
Advertisement
Advertisement
ఈ విషాయన్ని ఇటీవల వెల్లడించారు శాస్త్రవేత్తలు. కరోనా సోకిన వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని.. అధ్యయనాల ఆధారాలు చెబుతున్నాయి. అందువల్ల యూఎస్ పరిశోధకులు ప్రత్యేకంగా ఒక చూయింగ్ గమ్ రూపొందించారు. దీని సహాయంతో… నోటీలోని.. వైరస్ మొత్తాన్ని తగ్గించవచ్చు. దాని వ్యాప్తిని అరికట్టవచ్చనునని చెబుతున్నారు. నోటి ఆరోగ్యాన్ని కాపాడడంతో… నోటీకి వ్యాయామం అందించడంలో చూయింగ్ గమ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.
అయితే.. చూయింగ్ గమ్ లోని.. ACE2 ప్రోటీన్లు.. నోటిలోని వైరస్ కణాలను ఆపగలవు. అవి మనక కణాలకు సోకే అవకాశాన్ని తగ్గించవని నిరూపించారు. మొక్కలలో ఉత్పత్తి అయిన.. అధిక స్థాయి ACE2 ప్రోటీన్లను కలిగి ఉన్న గమ్ ను పరిశోధకులు తయారు చేశారు. ఇది ప్రారంభ దశ పరిశోధన కావడంతో ఫలితాలను నిర్ధారించలేపోతున్నారు. చూయింగ్ గమ్ నమలడం అనేది ఒక్కో వ్యక్తి లో ఒక్కో విధంగా ఉంటుంది. కాగా.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే.