ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో పేరు హాట్ టాపిక్ గా మారింది. చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఇండియాతో పాటూ విదేశాల్లోనూ క్యాసినో నిర్వహిస్తున్నాడని…అక్రమంగా కోట్లల్లో డబ్బులు సంపాదించాడని అతడి పై ఈడీ రైడ్స్ నిర్వహించి ప్రస్తుతం విచారిస్తోంది. విచారణలో చికోటికి ఎమ్యెల్యేలు, ఎంపీలతోనూ సంబంధాలు ఉన్నాయని తేలింది. దాంతో ఈడీ సదరు ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు పంపంది.
Advertisement
ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవ్వడంతో అసలు క్యాసినో అంటే ఏంటి..? క్యాసినో లీగలేనా.? ఇలా పలు అనుమానాలు మొదలయ్యాయి. క్యాసినో అంటే డబ్బుల కోసం ఆట ఆడే ఒక ప్రదేశం. జేమ్స్ బాండ్ సినిమాల్లో చూపించేమాదిరిగానే క్యాసినోలు కలర్ ఫుల్ గా ఉంటాయి. క్యాసినో అంటే గ్యాంబ్లింగ్ ….ఈ ఆట ఆడటానికి నైపుణ్యాలు అవసరం లేదు. ఛాన్స్ ఉంటే సరిపోతుంది. క్యాసినోలో అన్నీ గ్యాంబ్లింగ్ ఆటలు ఉంటాయి.
Advertisement
ఇందులో ప్రధానంగా బ్లాక్ జాక్, పోకర్, రూలెట్, బాక్రా, క్రాప్, తీన్ పత్తి, అందర్ బహర్ లాంటి ఆటలను ఆడతారు. క్యాసినో లో ఆటలతో పాటూ రెస్టారెంట్, కచేరీలు, డ్యాన్స్ లు మందు విందు అన్నీ దొరుకుతాయి. అంతే కాకుండా ఆడే వారిని ఎంకరేజ్ చేయడానికి అమ్మాయిలు పోల్ డ్యాన్స్ చేయడం కూడా ఉంటుంది. అలసిపోతే అక్కడే మసాజ్ లు చేసుకునే సదుపాయాలు కూడా ఉంటాయి.
దాంతో ఆడటం ఇంట్రెస్ట్ లేకపోయినా వచ్చి చూసి ఎంజాయ్ చేసేవారు కూడా చాలా మంది ఉంటారు. భారత్ లోనూ క్యాసినోలకు పర్మిషన్ ఉంది కానీ అది కొన్ని ప్రాంతాలకే పరిమితం. అందువల్లే గుడివాడలో క్యాసినో నిర్వహిస్తే కేసులు నమోదయ్యాయి. ఇండియాలో గోవా, సిక్కిం, డామన్ డయ్యి లో క్యాసినోలకు పర్మిషన్ ఉంది. అంతే కాకుండా సింగపూర్ తో సహా కొన్ని దేశాలలో క్యాసినోకు పర్మిషన్ ఉంది. దాంతో చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లి క్యాసినో ఆడుతుంటారు.
also read : టాలీవుడ్ ను జక్కన్నే నాశనం చేశాడు…దర్శకదీరుడి పై ఆర్జీవీ ఫైర్..!