భార్య భర్తలు కలకాలం కలిసి ఉండాలని పెళ్లి చేసుకుంటారు. అయితే ఒకప్పుడు భార్యా భర్తలు ఎక్కువగా విడాకులు తీసుకునేవారు కాదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉండటం. పెద్దలు చెప్పినట్టు వినటం. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా లేకపోవడం ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు భార్య భర్తలు చిన్న చిన్న గొడవలకు కూడా విడాకులు తీసుకుంటున్నారు. దాంతో పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి.
Advertisement
కాబట్టి సంసార జీవితంలో భార్య భర్తలు జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా విడాకులకు ఎక్కువగా చెప్పే కారణాలలో అనుమానం ఒకటి అని చెబుతున్నారు. భార్య చేసే కొన్ని తప్పుల వల్ల భర్తలకు అనుమానాలు మొదలవుతాయట. సాధారణంగా పెళ్లికి ముందు భర్తలు గతంలో ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతారు. ఏమైనా ఉంటే చెప్పు అని స్వీట్ గా అడిగేసరికి కొంతమంది భార్యలు తమ లవ్ స్టోరీ చెప్పేసి ఇప్పుడు అతడితో ఎలాంటి సంబంధం లేదని చెబుతారు.
Advertisement
అయినప్పటికీ భర్తకు భార్యపై అనుమానం మొదలవుతుందట. అప్పటి నుండి భార్య పై నిఘా పెంచి వేధించడం మొదలు పెడతారట. కాబట్టి భార్యలు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించి ఉంటే పెళ్లి తరవాత వారిని మర్చిపోయి..ఆ విషయాన్ని కూడా భర్తలకు చెప్పకూడదట.
ఒకవేళ పెళ్లికి ముందు ప్రేమించినవాడు ఇబ్బంది పెడితే మాత్రం కచ్చితంగా భర్తలకు చెప్పాలట. అలా కాకపోతే పుట్టింటి వారికైనా ఆ విషయాన్ని చెప్పుకోవాలట. అంతే కాకుండా బంధువులలో ఎవరితో అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉండి మాట్లాడి మరొకరిని వివాహం చేసుకోవాల్సి వస్తే ఆ విషయాన్ని కూడా భర్తలకు చెప్పకపోవడమే మంచిదట.