గూగుల్ పిజ్జాతో యూజర్స్ ను ఆటలు ఆడిస్తోంది. పాపులర్ సెర్చ్ ఇంజిన్ చాలా కాలంగా ప్రత్యేక సందర్భాల్లో గూగుల్ డూడుల్ ద్వారా ఆరోజును మరింత ప్రత్యేకంగా చేస్తుందన్న విషయం తెలిసిందే. డూడుల్ ద్వారా ఆ ప్రత్యేక రోజుకు సంబంధించిన ఇమేజ్ గానీ, యానిమేషన్ గానీ గూగుల్ ప్లేస్ లో కన్పిస్తుంది. నేడు పిజ్జా డూడుల్‌ను సిద్ధం చేసింది గూగుల్. 2007వ సంవత్సరంలో ఇదే రోజున నియాపోలిటన్ పిజ్జా రెసిపీ UNESCO ప్రతినిధి జాబితాలో చేర్చారు. కాబట్టి గూగుల్ ఈరోజు ఈ డూడుల్‌ని రూపొందించింది.
Advertisement
Advertisement
ఇక డూడుల్ గేమ్ లో మొత్తం 11 రకాల పిజ్జాలను కట్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత యూజర్లకు స్టార్స్‌లో రేటింగ్ లభిస్తుందని సంస్థ తెలిపింది. ఇందులో ముజ్జరెల్లా పిజ్జా ఉన్నాయి. (చీజ్, ఒరేగానో, హోల్ గ్రీన్ ఆలివ్), హవాయి పిజ్జా (చీజ్, హామ్, పైనాపిల్), మాగ్యరోస్ పిజ్జా (చీజ్, సలామీ, బేకన్, ఉల్లిపాయ, మిరపకాయలు), టెరియాకి మయోన్నైస్ పిజ్జా (చీజ్, టెరియాకి చికెన్ సీవీడ్, మయోన్నైస్), టామ్ యమ్ పిజ్జా (చీజ్, రొయ్యలు, పుట్టగొడుగులు, మిరపకాయలు, నిమ్మకాయ ఆకులు), పనీర్ టిక్కా పిజ్జా (చీజ్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, మిరపకాయలు), స్వీట్ పిజ్జా, మార్గరీటా పిజ్జా (చీజ్, టొమాటో, బాసిల్), పెప్పరోని పిజ్జా (చీజ్, పెప్పరోని), వైట్ పిజ్జా (చీజ్, వైట్ సాస్, మష్రూమ్, బ్రోకలీ), కాలాబ్రేసా పిజ్జా (చీజ్, కాలాబ్రేసా, ఆనియన్ రింగ్స్, హోల్ బ్లాక్ ఆలివ్) ఉంటాయి.