సినిమా నటుడు రియల్ హీరో సోనూసూద్ కు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసి మరోసారి షాక్ ఇచ్చింది. సోనూ సూద్ వసతి గృహం కోసం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హోటల్ గా మార్చారని బీఎంసీ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అక్రమంగా హోటల్ గా మార్చిన భవనాన్ని తిరిగి వసతి గృహంగా మార్చుతానని సోనూ మాట ఇచ్చారని అయితే ఆ మాట నిలబెట్టుకోలేదు అంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో 2021 నవంబర్ 15 న మొదటిసారి సోనూ సూద్ కు బిఎంసి నోటీసులు పంపింది.
Advertisement
భవనాన్ని వసతి గృహంగా కొనసాగించాలని హెచ్చరించింది. కోర్టు ఆర్డర్ ను దిక్కరించడం తో మరోసారి ముంబై మున్సిపల్ కమిషన్ నోటీసులు పంపింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేష్ కుసుముల సోనూ సూద్ పై బీఏంసీకి ఫిర్యాదు చేశారు. బాలికల హాస్టల్ ను సోనూ సూద్ హోటల్ గా మార్చారని ఆరోపించారు. ఇది చట్టరీత్యా నేరం కాబట్టి వెంటనే ఫిర్యాదు తీసుకుని బిల్డింగ్ ను కూల్చేయాలని గణేష్ పేర్కొన్నారు. దాంతో ఈ ఏడాది ప్రారంభంలో బిఎంసి సోనూ సూద్ తో చర్చలు జరిపింది.
Advertisement
దాంతో సోనుసూద్ ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో హైకోర్టు విచారణ అనంతరం తన పిటిషన్ ను వెనక్కి తీసుకుని తిరిగి వసతి గృహంగా మారుస్తానని అంగీకరించారు. కానీ అంగీకరించిన విధంగా హోటల్ ను వసతి గృహంగా మార్చకపోవడం వల్ల మరోసారి నోటీసులు పంపింది. ఇది ఇలా ఉంటే సోనుసూద్ లాక్ డౌన్ వేళ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు.